Site icon HashtagU Telugu

Pawan Kalyan : తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. హిందీ పాటని పాడుతూ..

Pawan Kalyan And His Daughter Aadya Konidela Singing Video Gone Viral

Pawan Kalyan And His Daughter Aadya Konidela Singing Video Gone Viral

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో సందడి చేస్తున్నారు. పవన్ చేసే ఈ పొలిటికల్ కాంపెయిన్స్ సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్ లో వైరల్ అవుతుండడంతో.. పలు ప్రముఖ నేషనల్ మీడియాలు పవన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ పవన్ కళ్యాణ్ తో రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆడియన్స్ కి తెలియని ఓ విషయాన్ని చెప్పామన్నారు.

దీనికి పవన్ బదులిస్తూ.. “నేను అమితాబ్ బచ్చన్ కి చాలా పెద్ద అభిమానాన్ని” అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత మీరు సరదాగా హమ్ చేసే పాట ఏంటి..? అని ప్రశ్నించారు. దానికి పవన్ బదులిస్తూ.. ‘ఏ రాతే ఏ మౌసమ్’ అనే హిందీ సూపర్ హిట్ పాటని పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది విన్న పవన్ అభిమానులకు.. ఈ పాటని మెగా ఫ్యామిలీలోని మరెవరో నోటి నుంచి విన్నట్లు గుర్తుకు వచ్చింది.

దీంతో నెట్టింట తెగ వెతికేసారు. ఫైనల్లీ ఆ పాటని గతంలో ఎవరో పాడారో కనిపెట్టసారు. గతంలో ఆ పాటని పడింది మరెవరో కాదు.. పవన్ వారసురాలు ‘ఆద్య’నే. ఓ తెలుగు టీవీ షోలో తల్లి రేణూదేశాయ్ తో కలిసి ఆద్య పాల్గొన్నారు. ఆ షోలో ఆద్యని తన ఫేవరెట్ సాంగ్ ని పడమనగా.. ఇప్పుడు పవన్ పాడిన పాటనే పడింది. దీంతో ఈ రెండు వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ.. ఆద్యకి పవనే ఆ పాటని నేర్పించినట్లు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తండ్రి కూతుళ్లు పాడిన ఆ పాటని మీరు కూడా వినేయండి.

Also read : Krish Jagarlamudi : మొన్న కంగనా.. నేడు పవన్ సినిమా.. మధ్యలోనే వదిలేస్తున్న దర్శకుడు..