Site icon HashtagU Telugu

Pawan Kalyan – Anna Lezhneva : బయటకు వచ్చిన పవన్ భార్య.. రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారుగా..

Pawan Kalyan and Anna Lezhneva photo shared by Janasena Party official Account

Pawan Kalyan and Anna Lezhneva photo shared by Janasena Party official Account

గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన మూడో భార్యతో కూడా విడాకులు(Divorce) తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ మూడో భార్య అన్నా లెజ్నెవా(Anna Lezhneva )తన సొంత దేశం రష్యా(Russia) వెళ్ళిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవి కావాలని, పనికట్టుకొని కొంతమంది చేస్తున్న పుకార్లని జనసేన నేతలు వ్యాఖ్యానించారు. పవన్ ఇమేజ్ ని దెబ్బ తీయడానికి ఓ పార్టీ వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.

తాజాగా ఇలాంటి రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ పవన్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఉన్న ఫోటో బయటకి వచ్చింది. అధికారికంగా జనసేన పార్టీనే ఈ ఫోటో షేర్ చేసి రూమర్స్ చేసే వాళ్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల పవన్ వారాహి యాత్ర సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు కాను తన హైదరాబాద్ ఇంట్లో పూజలు నిర్వహించగా పవన్ తో పాటు అన్నా లెజ్నెవా కూడా పాల్గొంది.

దీంతో పవన్, అన్నా లెజ్నెవా ఫోటోను జనసేన అధికారికంగా ట్వీట్ చేస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు అని తెలిపారు. రెండు రోజులుగా వస్తున్న రూమర్స్ అన్నిటికి జనసేన ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చింది.

 

Also Read : Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలకు బ్రేక్!