Site icon HashtagU Telugu

Pawan Heroine: 19 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్  హీరోయిన్

Pawan

Pawan

మీరా జాస్మిన్ (Meera Jasmine).. అనగానే చూడచక్కని అమ్మాయి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తమిళంలో మాత్రం మంచి ఫాలోయింగ్ చేసుకుంది. విశాల్ తో చేసిన పందెంకోడితో పాటు మరికొన్ని హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ.. మీరా జాస్మిన్ ఏ మూవీలోనూ నటించకుండా తెర మరుగైంది.

మళ్లీ మీరా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అంటే దాదాపు 19 ఏళ తర్వాత ఓ సినిమా చేసేందుకు సైన్ చేసింది.  YNot స్టూడియోస్‌లో ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న టెస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే మీరా రన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ బ్లాక్‌బస్టర్ తరువాత, మణిరత్నం తన 2004 చిత్రం అయుత ఎళుతులో వీరిద్దరిని కలిసి పనిచేశారు. ఇది వారి అద్భుతమైన కెమిస్ట్రీ చాలామందికి నచ్చింది కూడా. పాన్-ఇండియన్ (Pan Indian) చలనచిత్రంలో మీరా కీలక పాత్ర పోషిస్తుంది. ‘మానవ ఆత్మ విజయం, క్రీడాస్ఫూర్తి, స్నేహం లాంటి ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాలో మీరా నటిస్తోంది. ప్రముఖ గాయని శక్తిశ్రీ గోపాలన్ టెస్ట్‌కు స్వరకర్తగా మారారు.

Also Read: Karnataka Politics: క్యాంప్ పాలిటిక్స్ షురూ.. కాంగ్రెస్ అభ్యర్థులు హైఅలర్ట్!