Site icon HashtagU Telugu

Pawan Kalyan: రాజకీయాల్లో పవన్ బిజీ బిజీ.. 2023 లో ఒకే ఒక మూవీ!

Hari Hara

Hari Hara

హిట్స్, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాన్ ఒకరు. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా అతడికి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ తో సక్సెస్ అవుతుంటాయి. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ స్టార్ హీరో తన స్టార్ డమ్ కు తగ్గట్టుగా సినిమాలు అందించలేకపోతున్నాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ప్రస్తుతం పవన్ కోసం 3,4 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఆంద్రప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు పవన్ కు సినిమాల సమయం లేనట్లే కనిపిస్తోంది. దీంతో సెట్స్ పైనే ఉన్న సినిమాలను మాత్రమే కంప్లీట్ చేయాలనకుంటున్నాడు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ప్రొడక్షన్‌లో ఉన్న ‘హరి హర వీర మల్లు’లో మాత్రమే పనిచేయాలని పీకే నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పవన్ రాజకీయ కమిట్ మెంట్స్ కారణంగా ఇప్పటి వరకు చాలా షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒక షెడ్యూల్ మధ్యలో రాజకీయ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సినిమా షూటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో తన చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టేసి హరి హర వీర మల్లును కంప్లీట్ చేసే అవకాశాలున్నాయి.

ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘వినోతయ సీతమ్’ సినిమా జరగదని ఇప్పటికే ప్రొడక్షన్ బ్యానర్‌కి పవన్ తెలియజేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమానే కాదు సుజిత్‌తో పవన్ సినిమా, హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు కూడా పక్కన పెట్టారు. 2023లో కేవలం హరి హర వీర మల్లు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావచ్చనే టాక్ వినిపిస్తోంది.

Exit mobile version