ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..తాను ఏ హీరోకు పోటీ కాదని..ఇండస్ట్రీ లో హీరోలంతా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ..రాష్ట్ర అభివృద్ధి , రాజకీయ అంశాలతో పాటు చిత్రసీమ పట్ల కూడా స్పందించారు.
ప్రతి ఒక్క హీరో కూడా.. తనదైన స్టైల్ లో రాణిస్తున్నారన్నారు. సినిమాల పరంగా తనకు ఎవరితో ఇబ్బంది లేదని , ప్రతి ఒక్కరు ఒక్కొ విషయంలో ఎక్స్ పర్ట్ అన్నారు. బాలకృష్ణ , చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా.. వీరంతా ఒక్కొ దాంట్లో ఎక్స్ పర్ట్ అని , హీరోలందరూ బాగుండాలని కోరుకునేవాడినని అన్నారు. మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందుకే ఆర్థిక వ్యవస్థపై ముందు దృష్టి పెడదాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇన్నిరోజులు అభిమానులు.. ఓజీ .. ఓజీ అంటుంటే..తనకు మోదీ అని విన్పించేదన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరి కడుపు నిండడం ముఖ్యమన్నారు. అందుకు.. మన చుట్టుపక్కల రోడ్లు, స్కూల్స్ లను బాగు చేసుకుందామన్నారు. మన అభిమాన నటీ, నటుల సినిమాలకు వెళ్లాలన్న కూడా… రోడ్లు బాగుండాలని కదా , రోడ్లు, స్కూల్స్ బాగుచేసుకుందాం.. ఆ తర్వాతే వినోదాలు, విందులు. టికెట్ కొనుక్కోవలన్నా చేతిలో డబ్బులు ఉండాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ముందు బాధ్యత.. ఆ తర్వాత సినిమా అని పేర్కొన్నారు.
Read Also : Lawrence Bishnoi : జైల్లో ఉన్నా వణుకు పుట్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్.. ఎవరు ?