Pawan Kalyan : వరుణ్ కు పవన్ కళ్యాణ్ పెళ్లి కానుక ఏమిచ్చాడో తెలుసా..?

వరుణ్ కు పవన్ కళ్యాణ్ భారీ పెళ్లి కానుక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ కానుక ఏంటి అనేది రివీల్ చేయడం లేదు. త్వరలోనే దానిని వరుణ్ - లావణ్య లు తెలుపుతారు

Published By: HashtagU Telugu Desk
Pawan Gift

Pawan Gift

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి (Varun Tej Wedding) ఇటలీ లో కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, అల్లు అర్జున్, శిరీష్ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉన్న పిక్ మెగా ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటుంది. ఇక వరుణ్ కు పవన్ కళ్యాణ్ భారీ పెళ్లి కానుక (Pawan Gift) ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ కానుక ఏంటి అనేది రివీల్ చేయడం లేదు. త్వరలోనే దానిని వరుణ్ – లావణ్య లు తెలుపుతారు అని చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె పవన్ కల్యాణ్ ఉన్న బిజీ షెడ్యూల్ లో ఈ వివాహ వేడుకకు హాజరవుతారా లేదా అనే అనుమానం వచ్చింది. కానీ పవన్.. సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇటలీ వెళ్తునట్లుగా కనిపించి హమ్మయ్య అనుకునేలా చేసాడు. కానీ ఆ తర్వాత పెళ్లి వేడుకల్లో ఎక్కడ కనిపించకపోయేసరికి..పవన్ ఇటలీ నుండి ఎటైనా వెళ్లాడా..? ఎక్కడ కనిపించడం లేదేంటి..? హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ఇలా ఏ ఫంక్షన్ లో కనపడకపోయేసరికి అభిమానులు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా బయటకు వచ్చిన పిక్స్ లలో పవన్ కనిపించేసరికి హమ్మయ్య అనుకున్నారు. ఈ పిక్స్ లలో పవన్ క్యాజువల్ టీషర్ట్​లో బిస్కట్​ కలర్ ప్యాంట్ ధరించి కనిపించారు.

Read Also : Revanth Reddy : కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’ అంటూ రేవంత్ ట్వీట్

  Last Updated: 02 Nov 2023, 11:30 AM IST