పవన్ కళ్యాణ్ తాజా లుక్ (Pawan New Look)మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో కుంభమేళాలో ఆయన overweight గా కనిపించడంతో ట్రోల్స్‌కి గురైనప్పటికీ, ఇప్పుడు షార్ట్, టీ-షర్ట్‌లో కనిపించిన పవన్ పూర్తిగా ఫిట్‌గా మారిపోయారు. ముఖ్యంగా జూన్ 8న ఓ సెలూన్ ఓపెనింగ్(Salon opening)లో పవన్ కొత్త లుక్‌తో ప్రత్యక్షమవ్వడం, ఆయన అభిమానులనే కాకుండా నెటిజన్లని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu : అఖిల్ రిసెప్షన్ వేడుకలో అందరి చూపు మహేష్ టీ-షర్ట్ పైనే..దాని ధర తెలిస్తే షాకే !
ఈ ఫిట్‌నెస్ (Pawan Fitness) వెనుక ఉన్న రహస్యాల గురించి పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక ఆసక్తి ఉంది. అలాగే ఆయన బూట్ క్యాంప్స్ (సట్రెచింగ్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్) తరచుగా చేస్తారని నటుడు గగన్ విహారి వెల్లడించారు. పవన్‌కు రోజుకు 10 నుంచి 12 గంటల వరకూ వర్కౌట్ చేసే స్టామినా ఉందట. ఈ ట్రైనింగ్‌తో పాటు, ఆయన డైట్‌పైనా కఠిన నియంత్రణ పాటిస్తారని తెలుస్తోంది. పవన్ ఒక పూట భోజనమే తీసుకుంటూ, ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్‌కి ప్రాధాన్యం ఇస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవే ఆయన్ను ఫిట్ గా మారుస్తాయని తెలిపారు.
ప్రస్తుతం పవన్ పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డారు. అందుకే తన లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఓజీ సినిమా కోసం ఆయన లుక్ పూర్తిగా మారింది. కేవలం వ్యాయామం, డైట్ ద్వారానే కాక, మానసిక స్థితి కూడా పవన్‌ను పూర్తిగా డెడికేషన్‌తో పనిచేయేలా చేస్తుంది. ఏది ఏమైనప్పటికి పవన్ నయా లుక్ అందర్నీ కట్టిపడేస్తుంది.