Site icon HashtagU Telugu

BRO లో అంబటి రాంబాబు..ఇది కనిపెట్టారా..?

pawan fans troll ambati rambabu

pawan fans troll ambati rambabu

నిజామా..? బ్రో (BRO Movie ) లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఉన్నాడా..? అని ఆశ్చర్య పోతున్నారా..? అంతలేదు. కాకపోతే సినిమాలో ఓ దగ్గర 30 ఇయర్స్ పృద్వి (30 Years Prudhvi) ని చూసిన వారంతా అంబటి రాంబాబుని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ vs జనసేన వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను వైస్సార్సీపీ (YSRCP) టార్గెట్ గా పెట్టుకుంది.. రాజకీయాలతోనే కాకుండా సినిమాల ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ను డ్యామేజ్ చేయాలనీ చూస్తున్నారు.

పవన్ సినిమాలకు టికెట్ రేటు తగ్గించడం.. బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం..థియేటర్ల తనిఖీల పేరుతో అధికారులతో హడావిడి చేయించడం..థియేటర్స్ ను మూయించడం వంటివి చేస్తూ వస్తున్నారు. వకీల్ సాబ్ (Vakeel Saab) , భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాల విషయాల్లో అలాగే చేసారు. ఇక ఇప్పుడు బ్రో విషయంలో కూడా అలాగే చేస్తారని అంత భావించారు. కానీ జగన్ సర్కార్ ఈసారి పవన్ జోలికి పోలేదు. పవన్ కళ్యాణ్ ను ఎంత డ్యామేజ్ చేయాలనీ చూస్తే అంతకు రెట్టింపు ప్రభుత్వమే డ్యామేజ్ అవుతుందని బ్రో విషయంలో వేలుపెట్టలేదు.

కాకపోతే బ్రో లో ఓ సన్నివేశాన్ని మాత్రం జనసేన శ్రేణులు , అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసే అంబటి రాంబాబును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య అంబటి రాంబాబు ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని , జనాలతో డాన్స్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ బ్రో మూవీ (BRO movie)లో పెట్టినట్లు అర్ధం అవుతుంది. అంబటి రాంబాబును తలపించేలా 30 ఇయర్స్ పృథ్విని సిద్ధం చేశారు. పృథ్వి డాన్స్ మీద పవన్ కళ్యాణ్ సెటైర్స్ వేశారు. పవన్ ట్రోల్ చేసిన విషయం మంత్రి రాంబాబుకు తెలిసేలా… ఆయన ధరించిన టీ షర్ట్ ని పోలిన టీ షర్ట్ పృథ్వితో వేయించారు. క్యారెక్టర్ పేరు శ్యామ్ బాబు అని పెట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేసారని ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటూ ఆ వీడియో ను వైరల్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు ఈ సన్నివేశం ఫై ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Read Also : BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…