Pavithra Jayaram : సీనియర్ నటి పవిత్ర మృతి..

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది

Published By: HashtagU Telugu Desk
Pavitra Jayaram Dies

Pavitra Jayaram Dies

‘త్రినయని’ ఫేమ్ (Trinayani Serial Fame) పవిత్రా జయరామ్ (Pavithra Jayaram) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీ కొట్టడం తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కన్నడ నటి అయిన పవిత్రా జయరామ్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమెకు ఓ కూతురు కొడుకు ఉన్నారు. పెద్దగా చదువుకోలేకపోవడంతో.. హౌస్ కీపర్‌గా.. సేల్స్ గర్ల్‌గా.. లైబ్రరీ అసిస్టెంట్‌గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చింది పవిత్రా జయరామ్. ఆ తరువాత తెలిసిన వాళ్ల ద్వారా ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

మెల్లమెల్లగా సీరియల్స్‌లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్లింది. తెలుగులో మొదటిగా ‘నిన్నేపెళ్లాడతా’ సీరియల్స్‌లో అవకాశం అందుకుంది పవిత్రా జయరామ్. త్రినయని సీరియల్‌తో పేరు సంపాదించుకుంది. తిలోత్తమగా తనదైన విలనిజం చూపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.

ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కుడివైపున హైదరాబాద్‌ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష, డ్రైవర్‌ శ్రీకాంత్‌, సహ నటుడు చంద్రకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read Also : AP : సత్తెనపల్లి లో రోడ్డెక్కిన మహిళలు..ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆందోళన

  Last Updated: 12 May 2024, 03:54 PM IST