Site icon HashtagU Telugu

‘Pathaan’ Box Office: షారుఖ్ ఖాన్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు.. 2 రోజుల్లో 215 కోట్లు!

Pathaan

Pathaan

దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) మూవీ పఠాన్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. బాలీవుడ్ ఆశ్చర్యపోయేలా ‘పఠాన్’ (Pathaan) వైపల్యాల కరువు తీర్చేసింది. థియేటర్లు క్రిక్కిరిసిపోయాయి. మూతబడ్డ థియేటర్లు తెర్చుకుని కళకళలాడాయి. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 215 కోట్లు కలెక్షన్లు (Box office) వచ్చిపడ్డాయి. దేశవ్యాప్తంగా మొదటి రోజు 55 కోట్లు, రెండో రోజు 69 కోట్లు (గోదీ మీడియా ‘టైమ్స్ నౌ’ ప్రకారం) కలిపి 124 కోట్లతో అన్ని రికార్డుల్ని చెరిపేసి మెగా బ్లాక్‌బస్టర్ గా ఘన విజయాన్ని చాటింది. గత రెండేళ్ళుగా బాలీవుడ్ (Bollywood) చాలా కష్టాల్లో కూరుకుపోయిందనేది తెలిసిందే.

చాలా పెద్ద బ్యానర్ సినిమాలకి ప్రేక్షకులు లేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అదే సమయంలో అనేక థియేటర్లకి తాళాలు కూడా పడ్డాయి. కానీ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఈ మూతపడిన థియేటర్లకి అనూహ్యంగా వ్యాపారం తెచ్చిపెట్టింది. ‘పఠాన్’ (Pathaan) విడుదలతో ఉత్తరాదిలోని 25 సింగిల్ స్క్రీన్ థియేటర్లు తిరిగి తెర్చుకున్నాయి. రాజస్థాన్ లో 7, మధ్యప్రదేశ్ లో 3, గోవాలో 1, ముంబయిలో 1, ఛత్తీస్ ఘర్ లో 1, ఉత్తరాఖండ్ లో 1… వీటన్నిటినీ తలదన్నేలా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఏకంగా 11 సింగిల్ స్క్రీన్ థియేటర్ల తలుపులు బార్లా తెర్చుకున్నాయి.

మాకు అచ్చే దిన్ (మంచి రోజులు) వచ్చాయని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సంబరాలు ఎన్నాళ్ళు? ఇలాటి సినిమాలు రెగ్యులర్ గా వస్తూండాలిగా. అమీర్ ఖాన్ చూస్తే ఎవరికీ పట్టని ‘లాల్ సింగ్ చద్దా’ అని గడ్డం సవరించుకుంటూ క్లాస్ సినిమా తీస్తాడు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) చూస్తే కాషాయ జెండా ఎగరేస్తూ ఎజెండా సినిమాలు తీస్తాడు. మంచి కంటెంట్ లేకపోవడంతో చాలా థియేటర్లు చాలా కాలం క్రితం మూత బడ్డాయనీ, ‘పఠాన్’  (Pathaan) సింగిల్ స్క్రీన్ సినిమాల ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించే పెద్ద ఎంటర్‌టైనర్ కావడంతో థియేటర్లు తిరిగి తెరచుకున్నాయనీ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక ఎగ్జిబిటర్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో బాలీవుడ్ అంటే ఇట్టే చాటిచెప్పేలా చేశాడు.

Also Read: Rashmika Mandanna: విజయ్ తో విహారయాత్రకు వెళ్తే తప్పేంటి?.. రష్మిక రియాక్షన్

Exit mobile version