సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదరగొట్టేస్తుంది. ఈమధ్యనే ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ రిలీజైంది. ఈ సీరీస్ లో సమంత యాక్టింగ్ చూసి అందరు ఫిదా అయ్యారు. సీరీస్ సూపర్ హిట్ అవ్వడమే కాదు సమంతకు డబుల్ క్రేజ్ వచ్చింది. ఐతే రీసెంట్ గానే సమంత నటించిన సిటాడెల్ సీరీస్ చూసిన మలయాళ నటి పార్వతి తిరువోతు (Parvathi Tiruvothu) సమంత మీద పొగడ్తల వర్షం కురిపించింది.
సమంత (Samantha,) నువ్వు నిజంగానే ఒక ఫైర్. సిటాడెల్ హన్నీ బనీలో నీ యాక్షన్ సూపర్. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టావ్ అంటూ సమంత గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది పార్వతి. ఐతే దీనికి సమంత కూడా థ్యాంక్ యు సో మచ్ అని రిప్లై ఇచ్చింది. సమంత సిటాడెల్ సీరీస్ సైలెంట్ గా షూట్ చేసినా రిలీజ్ తర్వాత దాని ఇంపాక్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది.
సిటాడెల్ (Citadel) కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సమంత ఇక బాలీవుడ్ లోనే వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసేలా ఉంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే ఆమెతో మరో సీరీస్ కు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఐతే సమంత సొంత నిర్మాణంలో చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు.
మరి సిటాడెల్ సీరీస్ వల్ల సమంతకు సూపర్ క్రేజ్ రాగా అమ్మడు సౌత్ సినిమాలను పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Bachhala Malli – Teaser : బచ్చల మల్లి టీజర్ చూసారా..?