Prabhas : ప్రభాస్ పై ‘పరుచూరి’ కవిత..ఏమన్నఉందా..!!

prabhas birthday : 'ఈశ్వర్ వెండితెరపై ప్రత్యక్షమై, వర్షంతో అభిమానుల హర్షంతో మురిసి, ఛత్రపతితో అలరించి, బుజ్జిగాడుగా మురిపించి, ప్రేక్షకుల హృదయాల్లో మిస్టర్ పర్ఫెక్ట్, అందరి డార్లింగ్గా స్థానం సంపాదించి

Published By: HashtagU Telugu Desk
Prabhas Paruchuri

Prabhas Paruchuri

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈరోజు 45 వ ఏటా (Prabhas 45th Birthday) అడుగుపెట్టారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా బర్త్ డే విషెష్ లతో ట్రెండింగ్ గా మారింది. అభిమానులే కాదు యావత్ సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ ను అందజేస్తూ వస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషల వారు ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ (paruchuri gopala krishna) ప్రభాస్ పై కవిత్వం రాసి అభిమానులను కట్టిపడేసారు. ‘ఈశ్వర్ వెండితెరపై ప్రత్యక్షమై, వర్షంతో అభిమానుల హర్షంతో మురిసి, ఛత్రపతితో అలరించి, బుజ్జిగాడుగా మురిపించి, ప్రేక్షకుల హృదయాల్లో మిస్టర్ పర్ఫెక్ట్, అందరి డార్లింగ్గా స్థానం సంపాదించి, మాస్ ప్రేక్షకులకు మిర్చి రుచి చూపించి, నన్ను పెద్దనాన్న అని గౌరవించిన ప్రభాస్కి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర రారాజుగా విలసిల్లు’ అని ఆశీర్వదించారు. ఈ కవిత ప్రస్తుతం వైరల్ గా మారింది.

పరుచూరి గోపాలకృష్ణ విషయానికి వస్తే..పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఇద్దరిలో చిన్నవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఆయన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. 1990ల అనంతరం తెలుగు సినీ రంగంలో, మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో, వారు ఎన్నదగిన విజయాలను అందుకున్నారు. దర్శకత్వం చేసి మొదటి సినిమాతోనే నంది బహుమతిని అందుకున్నా, ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగు సినీ ప్రముఖుడు నందమూరి తారక రామారావు సలహా మేరకు తాము అప్పటికే మంచి పేరు సంపాదించుకున్న రచన రంగంలోనే ఉండి దర్శకత్వానికి దూరమయ్యారు. గోపాలకృష్ణ పలు సినిమాలలో ప్రతినాయకుడు, ప్రాధాన్యపాత్రలను ధరించారు. సినీ నటునిగా కూడా సంభాషణలు వైవిధ్యభరితంగా చెప్పగలిగిన స్వతఃసిద్ధ ప్రతిభతో రాణించారు. పరుచూరి గోపాలకృష్ణ, 1980ల నుండి 2000ల దాకా తెలుగు సినిమా పరిశ్రమలో స్ర్కిప్ట్ రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశాడు. తర్వాత వయసు రీత్యా సినిమాలకు కథలు రాయలేకపోతున్నారు.

Read Also : Jio Insurance : బజాజ్‌కు షాక్.. ‘అలయంజ్‌’తో కలిసి ‘జియో ఇన్సూరెన్స్’ వ్యాపారం

  Last Updated: 23 Oct 2024, 02:23 PM IST