Site icon HashtagU Telugu

Parushuram : డీజే టిల్లు తో సర్కార్ వారి సినిమా..?

Siddu Parushuram

Siddu Parushuram

వరుస సినిమాలతో డీజే టిల్లు ఫేమ్ సిద్దు (Siddhu Jonnalagadda) బిజీ గా మారాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar ) డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న..సిద్దు త్వరలో పరుశురాం (Parushuram) డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్. యువత మూవీ తో డైరెక్టర్ గా మారిన పరుశురాం. ఆ తర్వాత ఆంజనేయులు , సోలో , సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు మూవీస్ చేసాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత పరుశురాం గుర్తింపు ఎక్కడికో వెళ్ళింది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో సర్కార్ వారి పాట చేసాడు. ఇది పర్వాలేదు అనిపించుకుంది. దీని తర్వాత విజయ్ దేవర కొండా తో ఫామిలీ స్టార్ చేసాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. గత కొద్దీ రోజులుగా పరుశురాం ఎవరితో సినిమా చేస్తాడో అంటూ అభిమానులు ఎదుచూస్తూ వచ్చారు. కార్తీ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన అందులో నిజం లేదని తేలింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పరుశురాం..అతి త్వరలో సిద్దు తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్‌లో రూపొందించే అవ‌కాశాలు ఉన్నాయి. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ఇది వ‌ర‌కే ఒప్పందం చేసుకొన్నారు. ఈ మేర‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ని తెలుస్తోంది. ‘ఫ్యామిలీస్టార్‌’ చేసేట‌ప్పుడే దిల్ రాజు కాంపౌండ్ లో మ‌రో సినిమా చేయ‌డానికి ప‌ర‌శురామ్ అంగీక‌రించార‌ని టాక్. అలా.. ఈ ద‌ర్శ‌కుడ్ని, హీరోనీ ముడి పెట్టేశారు దిల్ రాజు. అయితే కార్తి కోసం అనుకొన్న క‌థే… ఇప్పుడు సిద్దుతో చేస్తున్నారా? లేదంటే ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌తో ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Priya Bhavani Shankar: ఆ పేరుతో శరీరాన్ని ప్రదర్శించడం ఇష్టం లేదు: ప్రియా భవానీ