Site icon HashtagU Telugu

Parineeti Chopra: 13న అప్ ఎంపీతో పరిణీతి నిచ్చితార్ధం

Parineeti Chopra

New Web Story Copy (89)

Parineeti Chopra: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కనున్నారు. గత కొంతకాలంగా ఆమెపై ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఓ ఎంపీతో లాంగ్ రిలేషన్ లో ఉన్నట్టు అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా పరిణీతి పెళ్లిపై క్లారిటీ వచ్చింది. ఓ పొలిటిషన్ తోనే ఆమె పెళ్లి జరగనుంది.

ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, సినీ నటి పరిణీతి చోప్రాల రిలేషన్ షిప్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తాజాగా ఆ చర్చకు తెర పడింది. వారిద్దరి నిశ్చితార్థం తేదీ ఖరారైంది. ఈ నెల 13న వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ధృవీకరించింది.

మార్చి నెలలో ఇద్దరూ ఒకే రెస్టారెంట్‌లో కలిసి కనిపించినప్పటినుంచి వాళ్ళిద్దరి రిలేషన్ పై ఎన్నో పుకార్లు వినిపించాయి. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్ని కొట్టిపారేసేవారు.మరోవైపు గత నెలలో రాఘవ్ మరియు పరిణీతి రిలేషన్ పై ఆప్ ఎమ్మెల్యే ఒకరు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో వీరి జోడీకి ‘రగ్నీతి’ అనే పేరు వచ్చింది.

Read More: Delhi Liquor : క‌విత మ‌రో క‌నిమొళి కాదు..డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్‌!