Parineeti Chopra: పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలాలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరు ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరిద్దరి ఎఫైర్ గురించి మీడియా పలుమార్లు అడిగినప్పటికీ అదేం లేదంటూ కొట్టిపారేశారు. ఇక తాజాగా ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒకటయ్యారు.
ప్రియాంక చోప్రా, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు సినీ తారలు మరియు రాజకీయ నాయకుల సమక్షంలో రాఘవ్ మరియు పరిణీతి నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన అనేక చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాఘవ్ మరియు పరిణీతి చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత వారు నిశ్చితార్థం చేసుకున్నారు.
Watch | Happy couple Parineeti Chopra and Raghav Chadha share a kiss at their engagement ceremony
Read: https://t.co/LjppnG8jjP pic.twitter.com/dZHQQjVChq
— NDTV (@ndtv) May 14, 2023
నిశ్చితార్థ వేడుక వీడియో ఆకట్టుకుంటుంది. ఈ ‘తేరే బినా దిల్ నైయో లగ్డా’ పాటకు పరిణీతి అదరగొట్టింది. తన ప్రియుడిని చూస్తూ పెదవి సింక్ చేయడం చూడముచ్చటగా అనిపించింది. ఈ పాటలో పరిణీతి చాలా ఫన్ మూడ్‌లో కనిపిస్తుంది. ఇక రాఘవ్ పరిణీతి చెంపపై ముద్దుపెట్టి, కౌగిలించుకున్నాడు. దీంతో వేడుకకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.
Read More: Pakistan: పాక్ లో హింసాత్మక నిరసనలు.. హెచ్చరించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మునీర్…!