Site icon HashtagU Telugu

Paresh Rawal: కాపీ కొట్టడం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య.. సంచలన వ్యాఖ్యలు చేసిన పరేశ్‌ రావల్‌!

Paresh Rawal

Paresh Rawal

నటుడు పరేశ్‌ రావల్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని కాపీ సినిమాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపీ కొట్టడం మొదట్లో నేనూ చూశాను. దర్శకుడి దగ్గరకు వెళ్లి సినిమా తీయాలనుందని చెప్పారనుకో, మీకో దుమ్ముపట్టిన క్యాసెట్‌ ఇస్తాడు. నువ్వు ఈ సినిమా చూడు నేను ఇంకోటి చూస్తాను.

రెండూ మిక్స్‌ చేద్దాం అంటాడు. కానీ ఒకానొక దశలో ఏం జరిగేదంటే హాలీవుడ్‌ స్టూడియోలు ఇండియాలోకి ప్రవేశించాయి. హాలీవుడ్‌ చిత్రాలను కాపీ కొట్టాలంటే వారికి డబ్బు చెల్లించాలి. చివరకు సినిమా ఆడకపోతే నష్టాల్లో కూరుకుపోవాలి. ఇదంతా ఎందుకని దర్శకులు సొంతంగా కథలు రాసుకోవడం మొదలు పెట్టారు. లేకపోతే ఇంకా వారి కథల్ని దొంగిలిస్తూనే ఉండేవాళ్లం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతైనా మనం మంచి దొంగలం కదా. మనకు హాలీవుడ్ వే నచ్చుతాయి. హాలీవుడ్‌ వారి కార్యాలయాలను ప్రారంభించి మంచి పనే చేసింది.

దానివల్లే మనవాళ్లు వెనక్కు తగ్గారు. వీరి కథల్ని తీసుకున్నందుకుగానూ ఎక్కువ మొత్తం వారికే ఇస్తే మనకేం మిగులుతుందని ఆలోచించారు. సొంతంగా కథలు సృష్టించి విజయాలు అందుకున్నాడు. అప్పుడే ఈ తెలివి తక్కువ వాళ్లకు మన కథల్లోని శక్తి తెలిసొచ్చింది. మన కథలు ఎంత కొత్తగా, బలంగా, నాటకీయంగా ఉంటాయో అర్థం చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అలా బాలీవుడ్ లో చాలా సినిమాలు కాఫీ కొట్టినవి. బాలీవుడ్ కి కాఫీ కొట్టడం అన్నది వెన్నతో పెట్టిన విద్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.

Exit mobile version