UPI Vs Saifs Attacker : సైఫ్‌పై ఎటాక్.. యూపీఐ పేమెంట్‌తో దొరికిపోయిన దుండగుడు

ఈక్రమంలో పోలీసులకు ఒక లేబర్ కాంట్రాక్టర్(UPI Vs Saifs Attacker) సహకరించాడు. 

Published By: HashtagU Telugu Desk
Saif Ali Khans Attack Suspect Shariful Islam Shehzad Upi Payment Mumbai Police

UPI Vs Saifs Attacker : బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌‌‌‌పై కత్తితో దాడి చేసిన దుండగుడు షరీఫుల్ ఇస్లామ్ షహజాద్‌ అలియాస్ విజయ్ దాస్‌ను చాలా త్వరగా ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇంతకీ ఎలా ? అంటే.. యూపీఐ పేమెంట్ ద్వారా !! ఔను.. ఇది నిజమే. ఆ దుండగుడు పోలీసు కళ్ల నుంచి తప్పించుకొని తిరిగే క్రమంలో ఒక యూపీఐ పేమెంటును చేశాడు. ఆ లావాదేవీని పోలీసులు ట్రేస్ చేశారు. అది అతడి ఫోన్ నంబరే అని ధ్రువీకరించుకున్నారు. దుండగుడు షరీఫుల్ ఇస్లామ్ షహజాద్‌ ఉన్న లొకేషన్‌ను గుర్తించారు. వెంటనే 100 మంది పోలీసులను ఆ లొకేషన్‌కు పంపి.. అతడిని చుట్టుముట్టారు. విజయవంతంగా ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు ఒక లేబర్ కాంట్రాక్టర్(UPI Vs Saifs Attacker) సహకరించాడు.

Also Read :Clean Energy Policy : అద్భుతంగా ‘క్లీన్ ఎనర్జీ పాలసీ’.. చంద్రబాబు విజన్‌పై యావత్ దేశంలో చర్చ

విచారణ జరిగింది ఇలా..

  • పోలీసులకు దొరకడానికి ముందు షరీఫుల్ ఇస్లామ్ షహజాద్‌ ముంబైలోని దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్ వెలుపల మూడుసార్లు తిరిగాడు.
  • వోర్లి కోలివాడా ఏరియాకు వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ సమాచారాన్ని పోలీసులు సేకరించారు.
  • అతడు వోర్లి కోలివాడా ఏరియాలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ వద్దకు వెళ్లాడని నిర్ధారించుకున్నారు.
  • పోలీసులు నేరుగా వెళ్లి ఆ కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. షరీఫుల్ ఇస్లామ్ షహజాద్‌ పరాటాలు, నీళ్ల బాటిళ్ల కోసం గూగుల్ పే యూపీఐ ద్వారా పేమెంట్  చేశాడని కాంట్రాక్టర్ చెప్పాడు. దీంతో ఆ వివరాల ప్రకారం షహజాద్‌ ఫోన్ నెంబర్ లొకేషన్‌ను తెలుసుకున్నారు.
  • కాంట్రాక్టర్‌ను కలిసిన అనంతరం.. థానే జిల్లాలోని లేబర్ క్యాంప్‌లో అతడు బస చేసినట్లు లొకేషన్ సమాచారంలో తేలింది.
  • దీంతో ఆ లేబర్ క్యాంపును పోలీసులు చుట్టుముట్టి, దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.
  • షరీఫుల్ ఇస్లామ్ షహజాద్‌ గతంలో థానేలోని ఓ హోటల్‌లో పనిచేశాడని విచారణలో వెల్లడైంది.
  • గతంలో అతడు ఎలాంటి నేరాలకూ పాల్పడలేదు.

Also Read :Social Robots : మనుషుల మనసెరిగిన ఏఐ సోషల్ రోబోలు.. ఫీచర్లు ఇవీ

  Last Updated: 20 Jan 2025, 04:02 PM IST