Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ ఓకే.. మరి కల్కికి ట్రైనింగ్ ఇచ్చే పరశురాముడు ఎవరు..?

Parashurama Role In Prabhas Kalki 2898 Ad Movie Details

Parashurama Role In Prabhas Kalki 2898 Ad Movie Details

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 AD’. హిందూ పురాణాలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మహాభారతం ముగింపుతో మొదలయ్యి 2898వ సంవత్సరంతో ముగియనుంది. ఇక ఈ సినిమాలో హిందూ పురాణంలో చెప్పబడిన సప్తచిరంజీవులు కనిపించబోతున్నారు. వేదం వ్యాసుడు, పరుశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి.. సప్త చిరంజీవులుగా చెప్పబడుతున్నారు.

ఇప్పటికి బ్రతికే ఉన్న ఈ ఏడుగురు విష్ణుమూర్తి దశావతారం కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ప్రభాస్ కల్కి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే కల్కి కథలో అసలైన పాత్ర అంటే పరశురాముడు. హిందూ పురాణాల్లో ఈ పాత్రకి ఒక మాస్ ఇమేజ్ ఉంది.

ఇక కల్కి పుట్టిన తరువాత తనని ఒక యోధుడిగా మార్చేందుకు పరశురాముడే ట్రైనింగ్ ఇస్తాడని పురాణాల్లో చెప్పుకొచ్చారు. మరి ప్రభాస్ కి గురువుగా ట్రైనింగ్ ఇచ్చే బలమైన పాత్రలో ఎవరు నటించబోతున్నారు..? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అశ్వత్థామ వంటి పాత్రకే అమితాబ్ ని తీసుకున్నప్పుడు, పరశురాముడి పాత్రకి ఇంక ఏ హీరోని తీసుకున్నారు. కాగా ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతోందని నిర్మాత అశ్విని డాట్ చెప్పుకొచ్చారు.

మరి పరశురాముడు వంటి మాస్ రోల్ లో ఏ హీరో కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. కాగా ఈ పాత్రని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియదు. ఒకవేళ అదే నిజమైతే.. పరశురాముడి పాత్రలో ఎన్టీఆర్ ని చూసి బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలవ్వడం ఖాయం. మరి నాగ్ అశ్విన్ ఆ పాత్రని ఎవరితో డిజైన్ చేసారో చూడాలి.