నేచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్నాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి హిట్ చిత్రాలతో తన మార్క్‌ను మరోసారి రుజువు చేసుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ‘కోర్టు’ వంటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (Paradise ) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలసి చేస్తున్న ఈ చిత్రానికి మొదటి నుంచే ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే?
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో అభిమానులను ఆశ్చర్యపరిచింది. నాని పాత్రలో ఒక విభిన్నమైన, రా అండ్ రస్టిక్ గెటప్ కనిపించింది. చేతిపై టాటూ, అసభ్య పదజాలం వాడకంతో సినిమాకు ఓ ఇంటెన్స్ టోన్ ఏర్పడిందని తెలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్(Paradise Audio Rights)ను సరిగమ గ్లోబల్ సంస్థ రూ.18 కోట్ల భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. ఈ స్థాయిలో రైట్స్ అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.
ఇక ఈ చిత్రంలో నటీనటుల వివరాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. నాని తల్లి పాత్రలో మొదట సోనాలి కులకర్ణి నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రమ్యకృష్ణ ఈ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు విలన్ పాత్రకు మంచు మోహన్ బాబు ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. కథలో ఉన్న బలాన్ని చూసి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు ముందే కలెక్ట్ చేస్తున్న హైప్ చూస్తుంటే, ఇది నాని కెరీర్‌లో మరో సెన్సేషనల్ మూవీ అవుతుందన్న మాట.