Samantha Health Issues: సమంతకు సీరియఎస్ హెల్త్ ఇష్యూ.. ఏం జరిగిందంటే?

భారతదేశంలోని అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌లలో వరుసగా అవకాశాలను దక్కించుకుంది.

Published By: HashtagU Telugu Desk
Samantha Goa

Samantha Goa

భారతదేశంలోని అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌లలో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. యశోద, శాకుంతలం, ఖుషి, ‘సిటాడెల్’ సినిమాలతో బిజీగా ఉంది.  ఆమె రాబోయే అన్ని ప్రాజెక్ట్‌ల గురించి ఆమె అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే తాజాగా సామ్‌కి సంబంధించిన ఓ పరిణామం పట్ల సమంత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం USA కి వెళ్లింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల వచ్చే ‘పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్’ అనే చర్మ వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. నటి ప్రస్తుతం విరామంలో ఉందని, వైద్యుల సలహా మేరకు బహిరంగంగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే సమంత కొద్దిరోజులుగా ట్విట్టర్, ఇన్ స్టాలకు దూరంగా ఉంటోంది. ఈ సమస్య కారణంగానే సమంత సోషల్ డిటాచ్ పాటిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 20 Sep 2022, 02:48 PM IST