Trailer Out : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలను పెంచేసింది!

పాన్ ఇండియా ప్రతిష్టాత్మక మూవీ.. దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. గురువారం ఉదయం చిత్ర నిర్మాత ట్రైలర్ ను విడుదల చేశారు.

Published By: HashtagU Telugu Desk
Ffwqdthvuam4ezx (1) Imresizer

RRR MOVIE TRAILER

పాన్ ఇండియా మూవీ.. దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. గురువారం ఉదయం చిత్ర నిర్మాత ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, మరోవైపు మెగా పవర్ స్టార్ సీతరామరాజుగా ఇద్దరూ అదరగొట్టేశారు. నువ్వానేనా అన్నట్టు శత్రువులపై దాడి చేసి సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే’.. అంటూ ఆవేశంగా యన్టీఆర్ పలికే డైలాగ్ అద్భుతం అనిపించకమానదు. ‘యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి’ ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

RRR జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథ వి.విజయేంద్రప్రసాద్ కాగా, కె.కె. డిఓపిగా సెంథిల్ కుమార్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది ఈ మూవీ.

  Last Updated: 09 Dec 2021, 11:40 AM IST