ప్రభుత్వ ఆస్తుల ధ్వసం కావడానికి కారణమయ్యాడని చెప్పి బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంతి రిమాండ్ రిపోర్ట్ (Remand Report) బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ లో పోలీసులు చెప్పింది ఏంటి అంటే.. ‘‘పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. పోలీసుల ముందే వీరు ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారు. న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్ళముందరే జరిగింది. వీరిని అరెస్టు చేయకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు.
We’re now on WhatsApp. Click to Join.
భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత భయము ఉండాలని ఉద్దేశంతోనే అరెస్టు చేశాము. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం కూడా ఉన్న కారణంగా పల్లవి ప్రశాంతను అదుపులోకి తీసుకున్నాం. పోలీసులు పలుమార్లు పల్లవి ప్రశాంత్‌కు విజ్ఞప్తి చేసినా కనికరించలేదు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టి కార్లు, బస్సులు ధ్వంసం కు పాల్పడ్డారు. రెండు కార్లను రెంట్‌కు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పారు. బిగ్ బాస్ షోకు వచ్చిన సెలబ్రిటీ కార్లను ధ్వంసం చేశారు. వీరికి 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేకే అరెస్ట్ చేసాము’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరో వైపు పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. దీనిపై కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
Read Also : Delhi Accident: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ళ బాలుడు మృతి