Pallavi Prashanth : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న పల్లవి ప్రశాంత్..?

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)..ఈ పేరు గత మూడు నెలలుగా వైరల్ గా మారింది. సామాన్య రైతు బిడ్డ..ఇప్పుడు సెలబ్రెటీ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ (Big Boss ) లో అడుగుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రశాంత్..చివరికి బిగ్ బాస్ 7 సీజన్ (Bigg Boss 7 Winner) లో అడుగుపెట్టడమే కాదు టైటిల్ ను గెల్చుకొని బయటకు వచ్చాడు. హౌస్ లో తనదైన ఆటతో..మంచితనం తో ఆకట్టుకున్న ప్రశాంత్..ఆ తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకొని […]

Published By: HashtagU Telugu Desk
Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)..ఈ పేరు గత మూడు నెలలుగా వైరల్ గా మారింది. సామాన్య రైతు బిడ్డ..ఇప్పుడు సెలబ్రెటీ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ (Big Boss ) లో అడుగుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రశాంత్..చివరికి బిగ్ బాస్ 7 సీజన్ (Bigg Boss 7 Winner) లో అడుగుపెట్టడమే కాదు టైటిల్ ను గెల్చుకొని బయటకు వచ్చాడు. హౌస్ లో తనదైన ఆటతో..మంచితనం తో ఆకట్టుకున్న ప్రశాంత్..ఆ తర్వాత కొన్ని వివాదాల్లో చిక్కుకొని జైలు కు కూడా వెళ్ళాడు. రీసెంట్ గా బెయిల్ ఫై బయటకు వచ్చిన ప్రశాంత్..మళ్లీ తన రైతు జీవితాన్ని మొదలుపెట్టాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో తన తోటి బిగ్ బాస్ హౌస్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ప్రశాంత్ కు హీరో (Hero) ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త ఇప్పుడు అభిమానులను సంతోషానికి గురి చేస్తుంది. ఈ విషయాన్నీ తోటి హౌస్ సభ్యుడు భోలే చెప్పడంతో ఇదే నిజమే కావొచ్చని అంత నమ్ముతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే షావలి (Bhole Shavali) మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కు సినిమా ఆఫర్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు. రైతు బిడ్డ హీరోగా, పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని నిర్మాతలు అడుగుతున్నారని భోలే తెలిపాడు. అయితే అది ప్రశాంత్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అతడికి ఓకే అయితే త్వరలోనే వెండితెరపై కనిపిస్తాడన్న షాకింగ్ విషయాలను వెల్లడించాడు భోలే. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి పల్లవి ప్రశాంత్ హీరోగా చేస్తాడా..? చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Rgv Vs Kolikapudi: వర్మ తల నరికితే కోటి రూపాయలు.. కొలికపూడిపై పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

  Last Updated: 27 Dec 2023, 02:21 PM IST