Site icon HashtagU Telugu

Pallavi Prashanth : బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌కు భారీ ఊరట..

Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

తెలుగు బిగ్‌బాస్‌ (Bigg Boss 7) సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్ట్ (Nampally Court) ఆయనకు బెయిల్ (Bail) మంజూరు చేసింది. బిగ్ బాస్ ఫైనల్ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహంతో పలు సెలబ్రెటీస్ కార్ల అద్దాలతో పాటు TSRTC బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్‌ కారణమని తెలుస్తూ ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

డిసెంబర్‌ 20న పల్లవి ప్రశాంత్‌, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకొని కోర్ట్ లో హాజరు పరుచగా.. కోర్టు వారికీ 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో భాగంగా ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ప్రశాంత్ కు కోర్ట్ ఆదేశించింది.

Read Also : Motichur Laddu: ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూ.. సింపుల్ గా చేసుకోండిలా?