బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ని విన్నర్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్ పోలీసుల మాట వినకుండా రోడ్ షో చేయడం, అతని అభిమానులు అత్యుత్సాహంతో పలు సెలబ్రెటీస్ కార్ల అద్దాలతో పాటు TSRTC బస్సుల అద్దాలు పగలగొట్టడంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్, ఎ-2గా అతడి సోదరుడుని కూడా చేర్చి మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిన్న ప్రశాంత్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
తాజాగా నేడు సాయంత్రం చంచల్ గూడా జైలు నుండి పల్లవి ప్రశాంత్ విడుదలయ్యాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ప్రశాంత్ కి ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రశాంత్ ని మీడియా ముందు ఎక్కడా మాట్లాడకూడదని చెప్పడంతో చంచల్ గూడా జైలుకు అతని అభిమానులు వచ్చినా ఎవ్వరితో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ప్రశాంత్ డైరెక్ట్ గా ఇంటికే వెళ్లినట్టు సమాచారం. ప్రశాంత్ తరపున వాదించిన లాయర్లు మాత్రం మీడియాతో కేసు గురించి మాట్లాడారు.
Also Read : Salaar Vs Dunki : ప్రభాస్ దెబ్బకి షారుఖ్ దరిదాపుల్లో కూడా లేడుగా.. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..