న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం (Nani Saripoda Shanivaram) సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత నాని సుజిత్ తో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. దానితో పాటుగా తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నాడు.
దసరా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ కాంబోలో ఈసారి దసరాని మించి సినిమా చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా (PAN India) రేంజ్ లో భారీ ప్లానింగ్ తో వస్తున్నారట. అందులో భాగంగానే సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట. నానితో జాన్వి ఇది అసలు ఊహించని కాంబో.. బాలీవుడ్ లో దూసుకెళ్తున్న జాన్వి కపూర్ తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తుంది.
ఆ సినిమా రిలీజ్ కాకుండానే చరణ్ సినిమాలో చాన్స్ అందుకుంది. బుచ్చి బాబు ( Bucchi Babu) రెండో సినిమా చరణ్ (Ram Charan) తో చేస్తుండగా ఆ సినిమాలో జాన్విని హీరోయిన్ గా తీసుకున్నారు. మొదటి రెండు సినిమాలు తారక్, చరణ్ తో చేస్తున్న జాన్వి థర్డ్ మూవీ నానితో చేస్తుందా అన్న డౌట్ మొదలైంది. ఐతే ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి కాబట్టి కచ్చితంగా జాన్వి నాని సినిమాకు ఓకే చెప్పే ఛాన్స్ ఉంది.
మొదటి సినిమా దేవర.. అది రిలీజ్ కాకుండానే చరణ్ తో ఫిక్స్.. ఇప్పుడు థర్డ్ సినిమా నానితో చేస్తుందని టాక్. ఐతే నానితో జాన్వి (Janhvi Kapoor) చేయడం వెనక రీజన్స్ ఏంటంటే.. బాలీవుడ్ లో యువ హీరోలతో నటిస్తున్న జాన్వి తెలుగుకి వచ్చేసరికి స్టార్స్ తోనే చేస్తుంది. ఐతే నాని లాంటి టైర్ 2 హీరోతో కూడా నటించి తాను ఎవరితో అయినా నటించేందుకు రెడీ అనిపించేలా చేస్తుంది.