Site icon HashtagU Telugu

Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ సూపర్ హిట్ సినిమా ‘మంగళవారం’ ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పటి నుంచి?

Paayal Rajput Mangalavaaram Movie Ready to Streaming in OTT

Paayal Rajput Mangalavaaram Movie Ready to Streaming in OTT

RX100 డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Paayal Rajput) మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం'(Mangalavaaram). ఓ హెల్త్ ప్రాబ్లమ్ తో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మంగళవారంని తెరకెక్కించారు. నవంబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసింది.

మంగళవారం సినిమాలో ప్రియదర్శి గెస్ట్ రోల్ చేయగా నందిత శ్వేతా, అజయ్ గోష్, చైతన్య కృష్ణ, దివ్య పిళ్ళై, రవీంద్ర విజయ్, అజ్మల్.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి అజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన సంగీతం చాలా బాగా ప్లస్ అయింది. మంగళవారం సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాలో పాయల్ ఓ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయిగా ఓ బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది.

థియేటర్స్ లో మంచి విజయం సాధించిన మంగళవారం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డిస్నీప్లస్ హాట్ స్టార్(DisneyPlus Hotstar) ఓటీటీలో డిసెంబర్ 26 నుంచి మంగళవారం సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మంగళవారం సినిమా హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్స్ లో సక్సెస్ అయినట్టే ఓటీటీలో కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

 

Also Read : Salaar Vs Dunki : ప్రభాస్ దెబ్బకి షారుఖ్ దరిదాపుల్లో కూడా లేడుగా.. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..