Site icon HashtagU Telugu

Radha Krishna: రాధేశ్యామ్ రిలీజ్ పై సందేహాలు.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే!

Radhe Shyam

Radhe Shyam

కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా వాయిదా పడనుందనే వార్తలు వినిపించాయి. దీంతో ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. “సమయం కఠినమైంది, హృదయాలు బలహీనమైనవి. జీవితం మనపైకి ఏది విసిరినా మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి” అంటూ రియాక్ట్ అయ్యారు. కోవిడ్-19 పరిస్థితి మరింత దిగజారడం వల్ల సినిమా విడుదల ఆలస్యం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో డైరెక్టర్ ఇలా స్పందించారు.

ప్రస్తుతానికి, రాధే శ్యామ్ 14 జనవరి 2022న సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని ఇచ్చిన తేదీకి విడుదల చేస్తారో లేదో చూడాలి. ఈ మూవీలో భాగ్యశ్రీ, కృష్ణం రాజు, సచిన్ ఖేడేకర్ మరియు ప్రియదర్శి కూడా సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే డైరెక్టర్ ట్వీట్ తో ఈ సినిమా రిలీజ్ పై సందేహాలు నెలకొని ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు.