పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షో టైం లో రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల అల్లు అర్జున్ కూడా ఒక బాధ్యుడు అని అతన్ని డిసెంబర్ 5న అరెస్ట్ చేసి ఆరోజు రాత్రి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ (Allu Arjun,) ఇష్యూ గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరంగా ఏం జరిగిందో వెల్లడించారు.
ఐతే తనపై వస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ కు వివరణ ఇస్తూ అల్లు అర్జున్ శనివారం రాత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదిలాఉంటే సీపీ ఆనంద్ అల్లు అర్జున్ ఇష్యూపై వివరణ ఇస్తూ జరిగింది ఏంటో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అది జరిగిన కొద్దిక్షణాల్లోనే ఓయు జేఏసీ (OU JAC) నేతలు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు
అల్లు అర్జున్ ఇంటిని ముచ్చటించి అల్లు అర్జున్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిని ముచ్చటించిన ఓయు జేఏసీ నేతలు ఇంటి ముందు బైటాయించి అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. రేవతి ఫ్యామిలీకి అల్లు అర్జున్ న్యాయం చేయాలని వారు కోరారు. ఐతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని ఓయు జేఏసీ నేతలు ని అరెస్ట్ చేశారు. అంతేకాదు అల్లు అర్జున్ ఇంటికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.