Site icon HashtagU Telugu

OTT Releases : రేపు OTT లో ఒకటి , రెండు కాదు 10 సినిమాలు వచ్చేస్తున్నాయి..

Ott Movies Feb9

Ott Movies Feb9

గతంలో శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని సినీ లవర్స్ ఎదురుచూసేవారు. ఎందుకంటే కొత్త సినిమాలు ఎక్కువగా శుక్రవారమే రిలీజ్ అవుతాయి కాబట్టి..కానీ ఇప్పుడు ఓటిటి అభిమానులు సైతం శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఓటిటి కి సినీ లవర్స్ బాగా అలవాటుపడ్డారు. కరోనా సమయంలో థియేటర్స్ మూతపడడంతో ఓటిటి లు జోరు పెంచాయి. అప్పటికి వరకు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..కానీ కరోనా తో ఇంటికే పరిమితమైన ప్రజలంతా ఓటిటి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత థియేటర్ ఓపెన్ అయ్యి..వారం కు రెండు సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో అనేక ఓటిటి సంస్థలు భారీ ధర పెట్టి అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న చిత్రాల రైట్స్ ను దక్కించుకుంటున్నారు. సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేలా ముందే నిర్మాతలతో ఒప్పందం చేసుకొని ఆ మేరకు స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా రేపు (ఫిబ్రవరి 09) ఒకటి , రెండు కాదు ఏకంగా 10 సినిమాలు ఓటిటి లో సందడి చేయబోతున్నాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా ఉంది. దీంతో పాటు ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ ‍అయలాన్ ఈ వీకెండ్‌లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరోపక్క థియేటర్స్ లలో రవితేజ ఈగల్ , యాత్ర 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Read Also : Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్‌లో పురుగుల అన్నం