Site icon HashtagU Telugu

Ott Movies: ఈవారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఇవే?

Ott Movies

Ott Movies

సమ్మర్ మొదలయ్యింది.. దీంతో ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం విడుదల కాబోతున్న వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టాలీవుడ్ హీరోయిన్
అదితి రావు హైదరీ కీలక పాత్రలో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్‌ జూబ్లీ. ఇందులో ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, అపరశక్తి ఖురానా, సిద్ధాంత్‌ గుప్త, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ జూబ్లీ వెబ్ సిరీస్ ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే జితు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం రోమాంచమ్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అదే శశికుమార్‌, ప్రీతి ఆశ్రాని కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ డ్రామా చిత్రం అయోథి.

గత నెలలో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 7నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. బీఫ్‌ అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 6 నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఇన్‌ రియల్‌ లవ్‌ టీవీ షో ఏప్రిల్‌ 6 నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. చుపా అనే హాలీవుడ్ సినిమా ఏప్రిల్‌ 7 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హంగర్‌ అనే హాలీవుడ్ మూవీ ఏప్రిల్‌ 8న స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సీరిస్ విషయానికొస్తే.. ది క్రాసోవర్‌ అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 4 హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక బుక్‌ మై షో విషయానికి వస్తే.. బ్యాట్‌మ్యాన్‌ హాలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాస్మోస్‌ అనే హాలీవుడ్ చిత్రం ఏప్రిల్‌ 7 నుంచి ట్రైనింగ్ కానుంది.ఆహా తమిళంలో బుర్కా అనే తమిళం మూవీ ఏప్రిల్‌ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version