Ram Charan: రామ్‌చరణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్.. మా నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో.. మేము కాదు.!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన చిత్రాల్లో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది. దీనికి గాను శనివారం రాత్రి హన్మకొండ నగరంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

  • Written By:
  • Updated On - January 29, 2023 / 08:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన చిత్రాల్లో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది. దీనికి గాను శనివారం రాత్రి హన్మకొండ నగరంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సక్సెస్ మీట్‌కు హాజరైన మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ.. మా నాన్న చిరంజీవి సౌమ్యుడని అందరూ అంటుంటారు. ఆయన క్వైట్‌గా ఉంటేనే ఇంత మందిమి వచ్చాం. అదే గట్టిగా బిగించి మాట్లాడితే ఏమవుతుందో ఇతరులకు తెలియదు. ఆయన సైలెంట్‌గా ఉంటారేమో కానీ మేము మాత్రం సైలెంట్‌గా ఉండం’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు నిర్మాతలకు కూడా చరణ్‌ చురకలు అంటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిలు సినిమా మీద ఎంతో ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు అని, ఎంతో ఇష్టంతో, డెడికేషన్‌తో సినిమాలు చేస్తారని, వారిలా ఎవరూ చేయలేరన్నారు. మైత్రి బ్యానర్‌లో పనిచేసిన అందరికి హిట్లు ఇచ్చారని తెలిపారు. కొందరు నిర్మాతలు, ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని, సినిమా ఎలా తీయాలి..? ఎలా చూసుకోవాలనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చరణ్ అన్నారు.

Also Read: Raashi Khanna :మతి పోగొడుతున్న రాశి ఖన్నా హాట్ పిక్స్

ఇంకా చరణ్ మాట్లాడుతూ.. అద్భుతమైన సినిమాని అందించిన దర్శకుడు బాబీకి థ్యాంక్స్ చెప్పారు. సినిమాని ఓ ఫ్యాన్‌ బాయ్‌గా చూసి ఎంజాయ్‌ చేశామన్నారు. పూనకాలు లోడింగ్‌ అనేలానే సినిమా ఉందన్నారు. నాన్నగారు సినిమాలో ఓ బ్రదర్‌లా అనిపించారని, అంత యంగ్‌గా చూపించారని తెలిపారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి అభినందనలు తెలిపారు. సినిమాలో రవితేజ పాత్ర అద్భుతంగా ఉందన్నారు. ఆయన పాత్ర ఇంకా లేదనే అసంతృప్తి ఉందని, దీంతో ధమాకా సినిమా కూడా చూసాను చెప్పారు. ఈ మూవీలో రవితేజ పాత్ర హలో బాసు ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోండి అనే డైలాగ్‌ తమ్ముడులాంటి రవితేజ అనగలిగాడు, దాన్నీ తీసుకోగలిగాం. అదే వేరే వాళ్లు అని ఉంటేనే తీసుకునేవాళ్లం కాదన్నారు. తన స్పీచ్‌తో వాల్తేరు వీరయ్య విజయ విహారం ఈవెంట్ లో రామ్ చరణ్ చేసిన ఈ హాట్‌ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.