Oscars 2025 : ఆస్కార్ అవార్డుల్లో ‘వికెడ్‌’, ‘అనోరా’ హవా.. విజేతలు వీరే

97వ అకాడమీ అవార్డులను లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌(Oscars 2025) వేదికగా ప్రదానం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Oscars 2025 Awards Winners Oscar Academy Awards

Oscars 2025 : 2025 సంవత్సరానికిగానూ ఆస్కార్‌ అవార్డులను ప్రకటించారు.  ‘వికెడ్‌’ చిత్రానికిగానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పాల్‌ తేజ్‌వెల్‌కు ఆస్కార్‌ వచ్చింది. ది రియల్‌ పెయిన్‌ సినిమాలో నటించిన కీరన్‌ కైల్‌ కల్కిన్‌‌ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు. జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ఆమె ‘ఎమిలియా పెరెజ్‌’ మూవీలో నటించింది.  ‘ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌’‌ను ఉత్తమ యానిమేటెడ్‌ లఘుచిత్రంగా ఎంపిక చేశారు. 97వ అకాడమీ అవార్డులను లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌(Oscars 2025) వేదికగా ప్రదానం చేశారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌ చేశారు. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్‌, లిసా, క్వీన్‌ లతీఫా, రేయ్‌ తమ ప్రదర్శనతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని ఏబీసీ, జియో హాట్‌స్టార్‌, స్టార్‌ మూవీస్‌, హులు, యూట్యూబ్‌ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్‌టీ టీవీ ప్రత్యక్షప్రసారం చేశాయి.

Also Read :Munnuru Kapu Leaders Meeting : అసలు విషయం చెప్పిన వీహెచ్

ఆస్కార్‌ విజేతల జాబితా

  • ఉత్తమ సహాయ నటుడు – కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
  • ఉత్తమ సహా నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – సీన్‌ బేకర్‌ (అనోరా)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే – పీటర్‌ స్ట్రాగన్‌ (కాన్‌క్లేవ్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – పాల్‌ తేజ్‌వెల్‌ (వికెడ్‌)
  • ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ – ది సబ్‌స్టాన్స్‌ మూవీ
  • ఉత్తమ ఎడిటింగ్ – సీన్‌ బేకర్‌ (అనోరా)
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – వికెడ్‌ మూవీ
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌- ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా
  • డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ – నో అదర్‌ ల్యాండ్‌
  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఫ్లో
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ – ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌
  • ఉత్తమ సౌండ్‌ – డ్యూన్‌: పార్ట్‌2
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌:పార్ట్‌2

Also Read :Women’s Day : ఏపీలో మహిళలకు ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్

  Last Updated: 03 Mar 2025, 08:17 AM IST