Oscars: పే ఆస్కార్ పండుగ.. గెలుపు గుర్రాలు ఇవే..

Oscars 2023: ఆస్కార్ 2023 అవార్డుల వేడుకలు మార్చి 13న జరగనున్నాయి.  దానికి ముందు ఈ అవార్డ్స్ ఏయే విభాగాల్లో ఎవరెవరు గెలుస్తారనే దానిపై హాట్ డిబేట్ నడుస్తోంది.

  • Written By:
  • Updated On - March 13, 2023 / 12:23 AM IST

Oscars 2023: ఆస్కార్ 2023 అవార్డుల వేడుకలు మార్చి 13న జరగనున్నాయి.  దానికి ముందు ఈ అవార్డ్స్ ఏయే విభాగాల్లో ఎవరెవరు గెలుస్తారనే దానిపై హాట్ డిబేట్ నడుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి ఎవరు.. ఏమిటి అనే టాపిక్స్ పై డిస్కషన్ జరుగుతోంది.

ఈ ఏడాది భారత్‌కు ఆస్కార్ రేసు ప్రత్యేకం. అకాడమీ అవార్డ్స్‌లో మన దేశానికి ఒకటి కాదు.. రెండు కాదు.. 3 ప్రాతినిధ్యాలు ఉన్నాయి. RRR యొక్క “నాటు నాటు” ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది. శౌనక్ సేన్ యొక్క డాక్యుమెంటరీ “ఆల్ దట్ బ్రీత్స్ బెస్ట్” డాక్యుమెంటరీ విభాగంలో ఇతర టైటిల్స్‌తో పోటీ పడుతోంది. “ది ఎలిఫెంట్ విస్పరర్స్” అనేది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ విభాగంలో ఉంది . అయితే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ఎవరు గెల్చుకుంటారు అనేది వేచి చూడాలి. సోమవారం ఉదయం ఆస్కార్ అవార్డును ఎవరు అందుకుంటారనే దానిపై పరిశీలకుల విశ్లేషణ ఇలా ఉంది..

■బెస్ట్ పిక్చర్

ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ బెస్ట్ పిక్చర్ రేసులో “ఎవ్రీ థింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” (EEAAO)
మూవీ మొదటి స్థానంలో ఉంది. దీనికి పోటీ ఇస్తున్న ఏకైక మూవీ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్. ఈ రెండింటితో పోలిస్తే మిగిలిన నామినీలు ఖచ్చితంగా బలహీనంగా ఉన్నారు. అయితే ఆస్కార్‌లో ఏదైనా జరగవచ్చు. వేరే మూవీకి కూడా ఆ అవార్డ్ రావచ్చు.

■ఉత్తమ దర్శకుడు

డేనియల్ సోదరులు ఈసారి చరిత్ర సృష్టించవచ్చు.ఉత్తమ చిత్రం కోసం పోటీపడుతున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్”(EEAAO) ను డేనియల్ సోదరులే డైరెక్షన్ చేశారు.ఈ బ్రదర్స్ కు గట్టి పోటీ ఇచ్చే సత్తా డైరెక్టర్ టాడ్ ఫీల్డ్ కు మాత్రమే ఉంది.టాడ్ ఫీల్డ్ తీసిన
ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా “టార్” ఈ సంవత్సరంలో అత్యధిక రేటింగ్స్ పొందిన చిత్రాలలో ఒకటి.

■ఉత్తమ నటుడు

ఈసారి ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ విభాగంలో ప్రధాన పోటీ ఇద్దరు హీరోల మధ్య ఉంది. వారే
ఆస్టిన్ బట్లర్ , బ్రెండన్ ఫ్రెజర్. ఎల్విస్ అనే మూవీలో ఆస్టిన్ బట్లర్ నటించాడు. ది వేల్ అనే మూవీలో
బ్రెండన్ ఫ్రెజర్ నటించాడు.
హీరో బట్లర్.. మరో హీరో ఫ్రేజర్ కంటే చాలా చిన్నవాడు. వీరిద్దరిలో ఒకరిని ఆస్కార్ వరించే ఛాన్స్ ఉంది.

■ఉత్తమ నటి

ఈసారి ఉత్తమ నటి విభాగంలో హీరోయిన్లు మిచెల్ యోహ్,కేట్ బ్లాంచెట్ పోటీ పడుతున్నారు.
“ఎవ్రీ థింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్”(EEAAO) మూవీలో మిచెల్ యోహ్ నటించారు.TAR మూవీలో కేట్ బ్లాంచెట్ యాక్ట్ చేశారు.  యోహ్ మరియు బ్లాంచెట్ ఇద్దరూ అవార్డ్ సీజన్ ద్వారా వివిధ ప్రదర్శనలలో ముందు వరుసలో ఉన్నారు.