Site icon HashtagU Telugu

Oscars 2022 : వేదికపై భార్య గుండు మీద జోక్స్…చెంప పగలకొట్టిన స్టార్ హీరో..!!

Oscars

Oscars

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక…ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ స్టార్ హీరో చేసిన పనే దీనికి కారణం. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదికపైకి వెళ్లారు. అక్కడ హోస్ట్ గా వ్యవహారిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు స్మిత్. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి క్రిస్ రాక్ జోక్ వేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఆయన ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు క్రిస్ రాక్…విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్GI జెన్ 2లాగా ఉందంటూ జోక్ చేశాడు. ఇలాంటి పెద్దవేదిక మీద తన భార్యపై కామెంట్స్ చేయడంతో…అది నచ్చని హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కోపం తన్నుకొచ్చింది. వేదికపైకి వెళ్లి క్రిస్ చెంప పగలకొట్టాడు.

కాగా 94వ అకాడమీ అవార్డుల వేడుకలో అప్పటిదాక నవ్వుతున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఈ పరిణామాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కారణంగా Disney+ Hotstarలో ఆస్కార్స్ లైవ్ కొంత సమయం ఆగిపోయింది. అయితే ఈ సంఘటన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా లేదా నిజమేనా అని కొందరు ఆలోచనలో పడ్డాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వీడియో వైరల్ గా మాడంతో ఈ ఘటన నిజంగానే జరిగింది. విల్ స్మిత్ , జాడా పింకెట్ స్మిత్ 1997లో మ్యారేజ్ చేసుకున్నారు. 2018లో జాడా పింకెట్ స్మిత్ తనకు అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఆ వ్యధి కారణంగా తన జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.