చిల్కూరి సుశీల్ రావు నిర్మించి , డైరెక్ట్ చేసిన ‘ఆస్కార్ చల్లగరిగ’ డాక్యుమెంటరీ ..తాజాగా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. 2023 ఆస్కార్ అవార్డ్స్ లలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కు గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఆస్కార్ అవార్డు గెలిచింది చల్లగరిగ గ్రామమేనని….ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ అన్నారు. ఇది తెలుగుపాట గెలుపు అని చెప్పుకొచ్చారు. ఆస్కార్ అందుకున్న తర్వాత తొలిసారిగా స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు వచ్చిన చంద్రబోస్ కు అపూర్వ స్వాగతం లభించింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో చెబుతాడు. దీనిని చిల్కూరి సుశీల్ రావు డాక్యుమెంటరీ గా తెరకెక్కించాడు. ఈ డాక్యుమెంటరీ డిసెంబరు 2023లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక చేయబడింది.
అలాగే డిసెంబర్ 10 , 2023న ముంబైలో జరగనున్న 12వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సైతం ఈ డాక్యుమెంటరీ ఎంపిక అయ్యింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ని మినీబాక్స్ ఆఫీస్ నిర్వహిస్తోంది.
Read Also : Abhiram : దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. సైలెంట్ గా రానా తమ్ముడి వివాహం..