Site icon HashtagU Telugu

Oscar Challagiriga : కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినీగా ‘ఆస్కార్ చల్లగరిగ’

Oscar Challagariga Cannes W

Oscar Challagariga Cannes W

‘నాటు నాటు’ (Naatu Naatu Song) గీత రచయిత సుభాష్ చంద్రబోస్‌(Chandrabose) పై చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) రూపొందించిన డాక్యుమెంటరీ “ఆస్కార్ చల్లగరిగ” (Oscar Challagiriga) కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ నామినేషన్‌లలో షార్ట్‌లిస్ట్ లో ఎంపికైంది. ఈ విషయాన్నీ ఈరోజు ( డిసెంబర్ 22, 2023) అధికారిక ప్రకటన చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెలక్ట్ అయినా తర్వాత.. సెమీ-ఫైనల్ కు చేరుకుంది. మరో రౌండ్ తర్వాత ..ఫైనల్ కు చేరుకుంది. ఈ ఫైనల్ లో US, చైనా, ఇండియా, చిలీ, జర్మనీ, కోస్టారికా, కెనడా, బల్గేరియా, కొలంబియా, బ్రెజిల్, ఫ్రాన్స్, క్యూబా, ఆస్ట్రేలియా, గ్రీస్, గినియా-బిస్సావు, నేపాల్, స్వీడన్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇరాన్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్రాలు స్విట్జర్లాండ్, స్పెయిన్, మాల్టా, యూకే, బెల్జియంలు నామినీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

2023 ఆస్కార్ అవార్డ్స్ లలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్‌ కు గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత చంద్రబోస్..తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు వచ్చి తన సంతోషాన్ని గ్రామస్థులతో పంచుకున్నారు. ఈ ఆస్కార్ అవార్డు గెలిచింది నేను కాదు చల్లగరిగ గ్రామమేనని….ఇది తెలుగుపాట గెలుపు అని చెప్పుకొచ్చారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. దీనిని చిల్కూరి సుశీల్ రావు డాక్యుమెంటరీ గా తెరకెక్కించాడు.

Read Also : Vyooham Pre Release : ‘వ్యూహం ‘ ప్రీ రిలీజ్ కు పవన్ , చంద్రబాబు లకు వర్మ ఆహ్వానం