Site icon HashtagU Telugu

2024 Oscar Awards : ఆస్కార్ అవార్డుల రేసులో టాప్ 10 మూవీస్.. ఇవే

2024 Oscar Awards

2024 Oscar Awards

2024 Oscar Awards : 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 11న (సోమవారం) అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ వేదికగా జరగనుంది. దీనికి పలు సినిమాలు ఇప్పటికే నామినేట్ అయ్యాయి. ఈసారి ఆస్కార్‌ పురస్కారాల్లో(2024 Oscar Awards) సత్తా చాటేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అమెరికన్‌ ఫిక్షన్‌

‘అమెరికన్ ఫిక్షన్’ మూవీలో స్టోరీ ఓ నవలా రచయిత, ప్రొఫెసర్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా గతేడాది కామెడీ డ్రామాగా తెరకెక్కింది. గతంలో ఇది టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఇటీవల బాఫ్టాలో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డునూ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఉత్తమ చిత్రం సహా 5 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది.

ఓపెన్‌ హైమర్‌

ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్‌ ఓపెన్‌ హైమర్‌ జీవితం ఆధారంగా  ఓపెన్‌ హైమర్‌ సినిమాను తీశారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల  బరిలో సినిమాల్లోకెల్లా ఓపెన్​ హైమర్​కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్కార్‌ పురస్కార వేడుకల్లో ఏకంగా 13 నామినేషన్లతో ఈ మూవీ ముందు వరుసలో ఉంది.

బార్బీ

‘బార్బీ’ బొమ్మను తలపించే పాత్రతో బార్బీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఆస్కార్‌ రేసులో ఉంది.  2023 సంవత్సరంలో ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా 8 నామినేషన్లతో ఆస్కార్‌ రేసులో ముందంజలో ఉంది.

పూర్‌థింగ్స్‌

1992లో అలాస్డర్‌ గ్రే రచించిన పుస్తకం ఆధారంగా పూర్‌థింగ్స్‌ మూవీ తెరకెక్కింది.విక్టోరియన్‌ లండన్‌లోని బెల్లా బాక్ట్సర్‌ అనే యువతి తన మరణం తర్వాత ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంటుందనేదే ఈ సినిమా స్టోరీ. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు, ఐదు బాఫ్టా అవార్డులను అందుకుంది. పూర్​థింగ్స్ మూవీ 11 విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లను పొందింది.

ది హోల్డ్‌ ఓవర్స్‌

‘ది హోల్డ్‌ ఓవర్స్‌’ మూవీ ఉత్తమ చిత్రంతో పాటు 5 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందింది. ఇదొక కామెడీ డ్రామా. ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయించింది. ప్రశంసలతో పాటు ఆస్కార్‌లో సత్తా చాటుకుంది.  ప్రతి ఏడాది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రెండు వారాలపాటు సెలవులు తీసుకుంటారు. కానీ, ఆ సెలవులకు కూడా వెళ్లని దురదృష్టవంతులనే ‘ది హోల్డ్‌ఓవర్స్‌’ అని పిలుస్తుంటారు.

Also Read : Telangana Congress : సీఎం రేవంత్ సీనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారా ? లేదా ?

ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ ’ మూవీ  2014లో మార్టిన్‌ అమిస్‌ రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. దీన్ని హిస్టారికల్‌ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో మూడు అవార్డులు గెలుచుకుంది. ఆస్కార్‌ బరిలో ఐదు విభాగాల్లో నామినేట్‌ అయ్యింది.

కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌​

‘కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌​’ మూవీ ఆస్కార్​లో 10 విభాగాలలో నామినేట్ అయ్యింది.  2017లో డెవిడ్‌ గ్రాన్‌ రాసిన పుస్తకం ఆధారంగా ఈ మూవీని తీశారు. ఒసాజ్‌ ప్రజలు నివసించే స్థలంలో చమురు కనుగొన్న తర్వాత ఒసాజ్‌ సభ్యుల వరుస హత్యలు జరుగుతాయి. వారి సంపదను దొంగిలించడానికి రాజకీయ నేత ప్రయత్నిస్తాడు. వాటిపైనే ఈ మూవీ స్టోరీ ఉంటుంది. గతేడాది అక్టోబర్ 20న ఈ మూవీ రిలీజైంది.

అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌

లీగల్‌ డ్రామా థ్రిల్లర్‌ జానర్‌లో ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌’ మూవీని తెరకెక్కించారు.  ‘బ్లైండ్ వ్యక్తి ఓ హత్యకు సాక్షి’ అనే ట్రాక్​తో ఉండటం వల్లే ఈ మూవీ ఆస్కార్ రేస్​లో నిలిచింది. గతేడాది ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఐదు ఆస్కార్​ నామినేషన్లను సాధించింది.

పాస్ట్‌ లీవ్స్‌

పాస్ట్‌ లీవ్స్‌ మూవీ ఒక రొమాంటిక్ డ్రామా. ఈ మూవీలో  బాల్యమిత్రులను దాదాపు 12ఏళ్ల తర్వాత విధి కలుపుతుంది. అలా కలిసిన ఇద్దరిలో ప్రేమ కావాలని ఒకరు, స్నేహితులుగానే ఉండిపోవాలని మరొకరు అనుకుంటారు. ఈ సినిమా రెండు విభాగాల్లో నామినేషన్లను సొంతం చేసుకుంది.

మాస్ట్రో

మాస్ట్రో మూవీ ఏడు ఆస్కార్‌ నామినేషన్లను దక్కించుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న లినార్డో- ఫెలిసియా మధ్య కొన్ని రోజులకే విభేదాలు మొదలవుతాయి. తప్పు తెలుసుకునే నాటికి ఫెలిసియా ఆరోగ్య సమస్యలతో చనిపోతుంది. వారి ప్రేమకు ఆ మరణం ముగింపు పలుకుతుంది. నవంబరు 22న విడుదలైన ఈ మూవీ ఎన్నో అవార్డులను గెలుచుకుంది.

Also Read :Varun Tej: ఓటీటీలోకి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!