Site icon HashtagU Telugu

Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకి ఊహించని అనుభవం.. అభిమాని ప్రవర్తనకు షాక్ అయినా నటి!

Urvashi Rautela

Urvashi Rautela

ఊర్వశి రౌతేలా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తన అందచందాలతో ఆకట్టుకుంటూ భారీగా అభిమానులను సంపాదించుకుంది. అందులో భాగంగానే ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక ఈ సినిమాలో దబిడి దబిడి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ పాటతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ సాంగ్ ను సినిమా వాళ్ళ కంటే ఉర్వశిని ఎక్కువగా ప్రమోట్ చేసిందని చెప్పాలి. అలాగే ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అదేవిధంగా రీల్స్ లో కూడా దుమ్ము దులిపేసిందని చెప్పాలి. పాట విడుదల అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో సాంగ్స్ ఆడియో సాంగ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఊర్వశి రౌతేలా దబిడి దబిడి సాంగ్ కు రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఊర్వశి ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కు వెళ్ళింది. అక్కడ కూడా ఈ చిన్నది దబిడిదబిడి సాంగ్ కు రీల్ చేసి సందడి చేసింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

 

ఊర్వశి డాన్స్ చేస్తుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి ఊర్వశిని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఆమె కూడా ఒక్కసారిగా షాక్ అయింది. అదే ఆమెను ముద్దు పెట్టిన వ్యక్తి మరెవరో కాదు ఓరి బాలీవుడ్ మోడల్.ఎంతోమంది సెలబ్రెటీ ఫ్రెండ్స్ ఉన్న ఓరి. సెలబ్రెటీలతో ఫోటోలు దిగుతూ సందడి చేస్తాడు. ఓరి స్టైల్ అంటూ సెలబ్రెటీలతో వెరైటీగా ఫోటోలకు ఫోజులిస్తూ వైరల్ అయ్యాడు. తాజాగా ఊర్వశితో కలిసి క్రికెట్ స్టేడియం లో దబిడి దబిడి సాంగ్ కు స్టెప్పులేశాడు. డాన్స్ చేస్తూ చేస్తూ సడన్ గా ఉర్వశిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.