2023 Indian Boxoffice Collections : 12వేల కోట్లు.. 2023 ఇండియన్ సినిమా రెవిన్యూ లెక్క ఇదే..!

2023 Indian Boxoffice Collections 2023 ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను కుమ్మేసింది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు కొన్ని.. కేవలం ప్రాంతీయ భాషల్లో సినిమాలు కొన్ని

Published By: HashtagU Telugu Desk
Ormax Media Announced 2023 Indian Boxoffice Collections

Ormax Media Announced 2023 Indian Boxoffice Collections

2023 Indian Boxoffice Collections 2023 ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను కుమ్మేసింది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు కొన్ని.. కేవలం ప్రాంతీయ భాషల్లో సినిమాలు కొన్ని ఇలా ఇండియన్ బాక్సాఫీస్ పై 2023 లో భారీ వసూళ్లను రాబట్టేలా చేశాయి. లాస్ట్ ఇయర్ ఇండియన్ టోటల్ బాక్సాఫీస్ 12 వేల కోట్లని ఆర్మాక్స్ మీడియా వెళ్లడించింది. అయితే వీటిలో బాలీవుడ్ సినిమాలదే ఆధిపత్యం కనిపిస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

2023 Indian Boxoffice Collections హిందీలో లాస్ట్ ఇయర్ రిలీజైన పఠాన్, జవాన్, యానిమల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాయి. 2023లో బాలీవుడ్ నుంచుఇ 5380 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇదివరకు ఎప్పుడు ఈ రేంజ్ బాక్సాఫీస్ వసూళ్లు రాలేదని తెలుస్తుంది.

ఇక సెకండ్ ప్లేస్ లో టాలీవుడ్ ఉంది. 2023 లో టోటల్ టాలీవుడ్ నుంచి 2300 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. ప్రభాస్ సలార్, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పాటుగా మరికొన్ని సినిమాలు ఈ వసూళ్లకు కారణమయ్యాయి.

ఈ క్రమంలో కోలీవుడ్ లాస్ట్ ఇయర్ 1960 కోట్ల దాకా రాబట్టింది. లియో, జైలర్ సినిమాలు 1300 కోట్ల దాకా రాబట్టాయని తెలుస్తుంది. ఈ క్రమంలో మలయాళ పరిశ్రమ 572 కోట్లు, కన్నడ పరిశ్రమ 312 కోట్లు తీసుకొచ్చాయి. అయితే హాలీవుడ్ సినిమాలు కూడా ఈ ఇయర్ 1139 కోట్లు రాబట్టాయి. 2022 తో పోల్చితే 15% బాక్సాఫీస్ వసూళ్లు పెరిగాయి. ఇక 2024 లో ఇది కచ్చితంగా పెరుగుతుందని చెప్పొచ్చు.

Also Read : Tollywood Industry Head : చిరంజీవే టాలీవుడ్ పెద్ద.. స్టార్ రైటర్ కామెంట్స్..!

  Last Updated: 23 Jan 2024, 05:18 PM IST