Matu Vadalara: 2019లో రితేష్ రానా Ritesh Rana అనే కొత్త డైరెక్టర్ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ Sri Simha హీరో గా…! పెద్ద కొడుకు కాలభైరవ Kaala Bhairava మ్యూజిక్ డైరెక్టర్ గా… కమెడియన్ సత్య Satya మార్క్ కామెడీ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా “మత్తు వదలరా” Mathu Vadalara. నెల జీతం సరిపోని కథానాయకుడు.. తాను చేసే ఉద్యోగం లోనే తెలివిగా దొంగతనం చేసి సంపాదించే క్రమంలో…! అనుకోని సమస్యల్లో చిక్కుకుంటాడు. వినటానికి క్రైమ్ స్టోరీ లా ఉన్న… అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిందీ మూవీ.
రాజమౌళి S. S. Rajamouli లాంటి పెద్ద డైరెక్టర్ అప్పట్లో ఈ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు…, కాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ Prabhas అయితే ఏకంగా ఆ డైరెక్టర్ రితేష్ రానా ని లైవ్ లో నాతో సినిమా చెయ్యి అని అడిగాడు. ఆ రేంజ్ లో ఆకట్టుకుందా సినిమా.., అయితే డైరెక్టర్ ఆ తర్వాత లావణ్య త్రిపాఠి Lavanya Tripathi తో హ్యాపీ బర్త్‌డే Happy Birthday అనే సినిమా తో రాగా ఆ సినిమా వచ్చిందీ, పోయింది కూడా తెలీదు చాల మందికి, కాకపోతే కొన్ని కామెడీ డైలాగ్స్ మాత్రం సోషల్ మీడియా లో కనిపిస్తుంటాయి.
ఇప్పుడు సూపర్ హిట్ మత్తు వదలరా కి సీక్వెల్ తో Mathu Vadalara 2 వస్తున్నారు అదే టీమ్, ఈ రోజు పార్ట్ 2 టీజర్ రిలీజ్ అవ్వగా కామెడీ మాత్రం మొదటి భాగానికి మించి ఉండబోతుంది అని అర్ధం అవుతుంది, సెటైరికల్ డైలాగ్స్ తో మత్తు పదార్ధాల నేపథ్యంలో ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేట్రికల్ రీలీజ్ అవ్వబోతుంది. మత్తు వదలరా సినిమాలో బాగ్రౌండ్ “ఓరినా కొడకా” అనే డైలీ సీరియల్ ప్లే అవుతూ ఉంటుంది, ఆ సీరియల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉంది ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినా టీజర్ చివరలో కూడా సీరియల్ పార్ట్ ని చూపించి మరో సారి ఫ్యాన్స్ గుండెల్లో ఉత్సాహం నింపారు మూవీ టీమ్.
టీజర్ ని బట్టి చూస్తే రెండో భాగం మొదటి కంటే గ్రాండ్ గానే తెరెకెక్కింది అని తెలుస్తుంది. సునీల్, అజయ్, ఫరియా అబ్దుల్లా లాంటి కొత్త తారాగణం కూడా కనిపిస్తున్నారు. మొదటి భాగాన్నినిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి, హేమలత సారథ్యంలోనే రాబోతుంది రెండో భాగం కూడా. చూడాలి మరి మత్తు వదలరా 2, ఫస్ట్ పార్ట్ అంచనాలు ఏ స్థాయిలో అందుకుంటుందో.