Site icon HashtagU Telugu

Sandeep Kishan: సినిమా ఫెయిల్.. అయినా ఆ విషయంలో గర్వంగా ఉన్న సందీప్ కిషన్?

Sandeep Kishan

Sandeep Kishan

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ఊరు పేరు బైరవకోన. ఇందులో కావ్య థాపర్, వర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. తాజాగా సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు పురస్కరించుకొని రామానుజ స్టూడియోస్ లో చిత్ర బృందం ఆదివారం ఉదయం శత చండీయాగం నిర్వహించింది. అనంతరం సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సందీప్‌, ఆనంద్‌, నిర్మాత అనిల్‌ సుంకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..

మేము రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాము. డైరెక్టర్ ఆనంద్ రాసే కథలన్నీ నాతో చెబుతూ ఉంటారు. ఒకసారి ఆయన ఈ కథ చెప్పినప్పుడు యాక్ట్ చేయమని అడిగారు. ఈ జోనల్లో సినిమాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. హర్రర్ సినిమాలు చూడటానికి కూడా నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను. ఆనంద్‌తో ఇలాంటి జోనర్‌ సినిమా అంటే నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఓకే చేసేశాను. కెరీర్‌ అనేది వ్యక్తిగత ప్రయాణం. ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ నా జర్నీ పట్ల సంతోషంగా ఉన్నాను. నేను ఇప్పటివరకూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇష్టం లేకుండా కొన్ని సినిమాలు చేశాను. అలా, చేసిన రెండు, మూడు సినిమాలు వదిలేసి ఉండాల్సింది.

అవి తప్ప నా కెరీర్‌లో మార్చుకోవాల్సిన విషయం ఏమీ లేదు అని తెలిపారు సందీప్ కిషన్. మైఖేల్‌ సినిమాకు మేము ఏదైతే ప్రామిస్‌ చేశామో దాన్ని డెలివరీ చేయలేకపోయాము. ఆ సినిమాతో మేము మంచి పేరు సాధించాం. దానికి నేను గర్విస్తున్నాను. మేము ఎంతో కష్టపడ్డామని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాలేదు కానీ, నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది అని తెలిపారు సందీప్.భైరవకోన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఇది యూనివర్సల్‌ కంటెంట్ ఉన్న సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇప్పటికే విడుదలైన ఒక పాట సక్సెస్‌ అయ్యింది. రెండేళ్ల పాటు దీన్ని షూట్‌ చేశాము. షూట్‌ చేసిన తర్వాత ప్రతీది రీచెక్‌ చేసుకున్నాము. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా అంటే అమితమైన ప్రేమ ఉండటం వల్లే నేను ఇప్పటికీ పరిశ్రమలోనే కొనసాగుతున్నాను. ప్రేక్షకులకు ఎప్పుడూ ఏదో కొత్త కథ చెప్పాలనే ఆలోచనలో ఉంటాను అందుకే రెండేళ్లు టైమ్‌ పట్టినా ఈ సినిమానే చేశాను చెప్పుకొచ్చారు సందీప్.