Ooru Peru Bhairavakona : ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ డే కలెక్షన్స్

గత కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ (Sundeep Kishan)..తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona ) అంటూ ఫాంటసీ అడ్వెంచర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విఐ ఆనంద్ (VI Anand) దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్లు గా నటించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇక ట్రైలర్ తోనే ఆసక్తి […]

Published By: HashtagU Telugu Desk
Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

గత కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ (Sundeep Kishan)..తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona ) అంటూ ఫాంటసీ అడ్వెంచర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విఐ ఆనంద్ (VI Anand) దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్లు గా నటించగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇక ట్రైలర్ తోనే ఆసక్తి రేపగా..పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఫస్ట్ డే కలెక్షన్లు అనుకున్నదానికంటే ఎక్కువగానే వసూళ్లు సాధించి మేకర్స్ లో ఆనందం నింపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.30 కోట్లు షేర్ రాబట్టగా..ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.6.03కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సందీప్ కిషన్ కెరీర్​లో ఇది భారీ ఓపెనింగ్స్ అని చెప్పాలి. దీంతో సందీప్ కిషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాకు పబ్లిక్ రేటింగ్ ప్రకారం బుక్​ మై షోలో 9.1 స్టార్​, పేటీఎమ్​లో 96శాతం, ఐఎమ్​డీబీలో 9.2 స్టార్​లు వచ్చాయి. దీంతో వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే..

భైర‌వ‌కోన అనే ఊరిలో అడుగుపెట్టిన వారు ఎవ‌రూ ప్రాణాల‌తో తిరిగివ‌చ్చిన దాఖ‌లాలు ఉండ‌వు. దొంగ‌త‌నం చేసి త‌ప్పించుకునే క్ర‌మంలో బ‌స‌వ (సందీప్ కిష‌న్‌) అత‌డి స్నేహితులు ) జాన్ (వైవా హ‌ర్ష‌), గీత (కావ్య‌థాప‌ర్‌) భైర‌వ‌కోన‌లో అడుగుపెడ‌తారు. అక్క‌డ వారికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? బైర‌వ కోన నుంచి వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా? లేదా? ప్రియురాలు భూమి (వ‌ర్ష బొల్ల‌మ్మ ) కోసం బ‌స‌వ ఎందుకు దొంగ‌త‌నం చేయాల్సివ‌చ్చింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Read Also :

  Last Updated: 17 Feb 2024, 03:18 PM IST