పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్స్ తెలుగు రెండు రాష్ట్రాల్లో వేశారు. సినిమా గురువారం రిలీజ్ అనగా ముందు రోజు బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ మూవీ చూశారు. ఐతే హీరో వస్తున్నాడని తెలిసి భారీగా ప్రేక్షకులు వచ్చారు.
థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలుస్తుంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. సీపీఆర్ చేసినా సరే ఫలితం దక్కలేదని తెలుస్తుంది. అంతేకాదు ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీ తేజ్ కూడా తొక్కిసలాటలో గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
స్టార్ సినిమా రిలీజ్ టైం లో అందరు ఎవరికి వారు అన్నట్టుగా పక్కన వారిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి టైం లో మహిళలు, చిన్న పిల్లలు దూరంగా ఉండాలి. ప్రీమియర్ షో కు ఎంతమంది అటెండ్ అవుతారన్నది ఒక అంచనా ఉండదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంధ్య థియేటర్ లోనే అల్లు అర్జున్ (Allu Arjun) కూడా సినిమా చూడటం వల్ల ప్రేక్షకులు బాగా వచ్చారు.
ఐతే షో మొదలు అవ్వకముందే ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా విషయంలో సెక్యురిటీ పరంగా మేకర్స్ ఎంత తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. స్టార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. అలాంటి టైం లో తొక్కిసలాట జరుగుతుంది. ఐతే సినిమా యూనిట్ ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది.