Shakeela@Big Boss: నాడు పోర్న్ స్టార్.. నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్, అందరి కళ్లు షకిలపైనే!

యువతలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది పోర్న్ స్టార్ షకీల

Published By: HashtagU Telugu Desk
Shakila

Shakila

2000వ దశకం ప్రారంభంలో యువతలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది పోర్న్ స్టార్ షకీల. ముఖ్యంగా మలయాళంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలతో కుర్రకారును ఆకట్టుకుంది.  ఆమె ఒకప్పుడు పెద్ద హీరోలతో సమానంగా పోటీ పడింది. ఆమె చిత్రాలను నిషేధించమని డిమాండ్లు వినిపించేవి అంటే షకీల క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ షకీలాకు వరుస సవాళ్లు ఎదురయ్యాయి.

కాలంతో పాటు మారుతున్న ఇండస్ట్రీ ట్రెండ్స్‌తో మలయాళంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలకు డిమాండ్ తగ్గిపోయింది. ఆమె అందం కొవ్వొత్తిలా కరిగిపోయేసరికి.. ఆమె నమ్ముకున్న వాళ్లు ఒక్కొక్కరుగా దూరం అయ్యారు. ఆస్తులు పోయి ఆర్ధికంగా చితికిపోయింది షకీలా. ప్రస్తుతం చెన్నైలో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో చిన్న గదిలో నివాసం ఉంటుంది షకీలా. తాను తప్పు చేసిన తొలిరోజే తన తల్లి అడ్డు చెప్పి ఉంటే.. ఇప్పుడు తన పరిస్థితి ఇలా ఉండేది కాదని.. తాను కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉండేదాన్ని అని చెప్పింది

పోర్న్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ‘జయం’ చిత్రంలో నటించి మళ్లీ అందర్ని ఆకర్షించింది. కొంతకాలం రెగ్యులర్ సినిమాల్లో నటిస్తూ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడింది. తాజాగా షకీలా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆమె ‘బిగ్ బాస్ 7’లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. షకీలా తన పాత ఇమేజ్‌ను చెరిపివేస్తూ అన్ని వర్గాలకు దగ్గరకు కావాలనే లక్ష్యంతో ‘బిగ్ బాస్’లోకి ప్రవేశించింది. అందరి చేత ‘షకీల అమ్మ’ అని పిలవబడాలని కోరుకుంటుందీమె.

Also Read: Ram Charan Tweet: ఉదయనిధికి రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్, సనాతన ధర్మం మన బాధ్యత అంటూ ట్వీట్!

  Last Updated: 04 Sep 2023, 05:58 PM IST