సినిమా రంగంలో అవకాశాలు అందరికీ కలిసి రావు. కొందరు భారీ విజయాలను సాధిస్తే, మరికొందరు కొత్త మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో మయూరి కాంగో (Mayuri Kango) ఒకరు. ఈమె ఒకప్పుడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా, రాణించలేకపోయింది. మహేశ్ బాబు(Mahesh Babu)తో వంశీ మూవీ లో నటించడంతో పాటు, పలు టీవీ సీరియల్స్‌లోనూ ట్రై చేసినప్పటికీ అదృష్టం తలుపు తట్టలేదు. అయితే నటిగా నిలదొక్కుకోలేకపోయిన మయూరి, జీవితంలో కొత్త దిశలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Reliance Industries: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కష్టాలు!
సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో మయూరి కాంగో వివాహం చేసుకొని విదేశాలకు వెళ్లారు. ఆమె న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేసి, కార్పొరేట్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మేనేజ్‌మెంట్ రంగంలో తన కష్టపడే ధోరణితో, వ్యాపార నైపుణ్యాలతో మయూరి ఒక ప్రతిభావంతమైన ప్రొఫెషనల్‌గా ఎదిగారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థాయిలో పని చేసి, తనకు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
Virat Kohli Record: బ్యాటింగ్ చేయకుండానే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ స్థాయిలో అనుభవం సంపాదించిన మయూరి కాంగో ప్రస్తుతం గూగుల్ ఇండియాలో మేనేజర్ (Google India Manager) హోదాలో కొనసాగుతుంది. ఒకప్పటి సినీ నటిగా ఫెయిల్ అయిన ఆమె, ఇప్పుడు కార్పొరేట్ రంగంలో గొప్ప విజయాన్ని సాధించడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తాను సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయినా, జీవితాన్ని కొత్త కోణంలో చూసి, కార్పొరేట్ రంగంలో తన సత్తా చాటారు.
ఈమె జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. సాధించాలనే కోరిక, కష్టపడే నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని మయూరి నిరూపించారు. గూగుల్ ఇండియాలో ఒక కీలక స్థానంలో ఉండటమే కాకుండా, మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. నటనలో విఫలమైనప్పటికీ, జీవితంలో విజయం సాధించడంలో ఆమె నిరూపించిన పట్టుదల ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా ఉంటుంది.