నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప 2 తో మరింత పాపులర్ కాబోతుందని తెలుస్తుంది. యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టాక అమ్మడి రేంజ్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతుంది. పుష్ప 2 లో రష్మిక (Rashmika) ఆన్ స్క్రీన్ ఎంత కష్టపడిందో ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే రేంజ్ లో కస్టపడింది.
సినిమా చేశామా చేతులు దులుపుకుని వెళ్లామా అన్నట్టు కాకుండా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని అది ఎక్కడ జరిగినా అటెండ్ అవ్వడంతో రష్మికకు సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటన్నది తెలుస్తుంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఆడియన్స్ ని అలరించింది. ఇక Allu Arjun పుష్ప 2 సెకండ్ పార్ట్ లో కూడా రష్మిక అదరగొట్టబోతుందని తెలుస్తుంది.
Pushpa 2 ఆన్ అండ్ ఆఫ్.. స్క్రీన్ ఏదైనా రష్మిక తను చేస్తున్న పనిని 100కి 100 శాతం ఇష్టం తో చేస్తుంది అనడానికి ఇది నిదర్శనం. పుష్ప 2 ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొనడం సినిమాకు మంచి రీచ్ వచ్చేల చేసింది. నేషనల్ వైడ్ గా పుష్ప కి ఈ రేంజ్ బజ్ రావడానికి రష్మిక కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు.
పుష్ప 2 కూడా హిట్ పడితే రష్మికని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ఏది ఏమైనా రష్మిక క్రేజ్ పుష్ప 2కి ప్లస్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.