Om Raut Reaction: ఎవ‌ర్నీ నిరాశ‌ప‌ర్చాను: ఆదిపురుష్ డైర‌క్ట‌ర్

ఆదిపురుష్ టీజ‌ర్‌కు వ‌స్తోన్న ప్ర‌తికూల స్పంద‌న‌ల‌పై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ మ‌రోసారి స్పందించాడు.

  • Written By:
  • Publish Date - October 9, 2022 / 11:53 AM IST

ఆదిపురుష్ టీజ‌ర్‌కు వ‌స్తోన్న ప్ర‌తికూల స్పంద‌న‌ల‌పై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ మ‌రోసారి స్పందించాడు. సినిమాపై తాను పూర్తి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లు తెలిపాడు. బిగ్ స్క్రీన్ కోస‌మే ఈ మూవీని సిద్ధం చేశామ‌న్నాడు. చిన్న వీడియోను చూసి సినిమాపై అంచనాకు రావొద్ద‌న్నాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుద‌ల‌య్యాక చూసి ఎవ‌రూ నిరాశ చెందార‌ని, కావాలంటే నోట్ రాస్తాన‌ని పేర్కొన్నాడు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌ర్నీ అల‌రిస్తుంద‌ని వివ‌రించాడు.

ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌. ఈ మూవీలో సీతగా కృతిసనన్‌, లంకేశ్వ‌రుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మూవీ ల‌వ‌ర్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా టీజ‌ర్‌లో సైఫ్ అలీఖాన్ లుక్ పై నెటిజ‌న్లు దారుణ‌మైన ట్రోల్స్ చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.