Site icon HashtagU Telugu

Om Bheem Bush OTT Release Date Lock : ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Om Bheem Bush OTT Release Date Lock

Om Bheem Bush OTT Release Date Lock

Om Bheem Bush OTT Release Date Lock శ్రీ హర్ష డైరెక్షన్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన సినిమా ఓం భీమ్ బుష్. వి సెల్యులాయిడ్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజై సూపర్ హిట్ అయ్యింది. లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా దాదాపు అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటివరకు 30 కోట్ల దాకా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బ్యాంగ్ బ్రోస్ చేసే కామెడీ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. సినిమా థియేటర్ లో మిస్సైన వారు ఓటీటీ లో చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్ పై ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. ప్రైం వీడియోస్ వారు ఓం భీమ్ బుష్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 19న డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు. థియేట్రికల్ రన్ లో ఆడియన్స్ చేత నవ్వులు పూయించిన ఓం భీమ్ బుష్ ఓటీటీలో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Premalu OTT Release : ఫ్యాన్స్ డిజప్పాయింట్ .. ప్రేమలు ఓటీటీ రాలేదు ఎందుకంటే..?