Om Bheem Bush OTT : ఓం భీం బుష్ ఓటీటీ డీల్.. సినిమా ఎక్కడ..? ఎప్పుడు..? వస్తుంది అంటే..!

Om Bheem Bush OTT శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్

Published By: HashtagU Telugu Desk
Om Bheem Bush OTT Release Date Lock

Om Bheem Bush OTT Release Date Lock

Om Bheem Bush OTT శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఓం భీం బుష్. ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బ్యాంగ్ బ్రదర్స్ గా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన ఆకట్టుకుంది. సినిమా రెండు రోజుల్లోనే 10 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

సినిమా మౌత్ టాక్ తో మరింత వసూళ్లు తెచ్చుకునేలా ఉంది. అయితే ఓం భీం బుష్ సినిమా ఓటీటీ డీల్ గురించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రైం వీడియోస్ వారు ఓం భీం బుష్ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ముందే సినిమా డిజిటల్ రైట్స్ అమ్మేశారట. సినిమాకు భారీ మొత్తం లోనే ఓటీటీ రైట్స్ రూపంలో వచ్చాయని తెలుస్తుంది.

ఈ సినిమా ఎలాగు థియేట్రికల్ వెర్షన్ హిట్ అనిపించుకుంది కాబట్టి తప్పకుండా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తారు. అయితే సినిమా హిట్ అయ్యింది కాబట్టి 4 వారాల పాటు ఓటీటీలో వచ్చే ఛాన్స్ లేదు. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఓం భీం బుష్ ఓటీటీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కావాలనుకునే వారు ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీదే చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : Raviteja Venky : వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎవరికీ నచ్చలేదట.. డైరెక్టర్ బలవంతంతోనే పెట్టారా..?

  Last Updated: 25 Mar 2024, 09:54 AM IST